AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liger: అప్పుడే మొదలైన రౌడీ దండయాత్ర.. భారీ ధరకు లైగర్ డిజిటల్ ఆడియో రైట్స్..

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం లైగర్. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్న

Liger: అప్పుడే మొదలైన రౌడీ దండయాత్ర.. భారీ ధరకు లైగర్ డిజిటల్ ఆడియో రైట్స్..
Vijay Devarakonda
Follow us
Rajitha Chanti

|

Updated on: May 04, 2022 | 9:51 AM

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం లైగర్ (Liger). భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ మూవీతో అనన్య తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో విజయ్ బాక్సార్‏గా కనిపించనుండగా.. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్, సీనియర్ నటి రమ్యకృష్మ కీలకపాత్రలలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తైన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై మరింత అంచనాలను పెంచేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 25న విడుదల కాబోతున్న ఈ సినిమా ఇప్పుడే రికార్డ్స్ క్రియేట్ చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. తాజాగా లైగర్ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్.. శాటిలైట్.. ఆడియో రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడుపోయినట్లుగా టాక్ వినిపిస్తోంది. లైగర్ సినిమా ఆడియో హక్కులను సోనీ భారీ ధరకు కొనుగోలు చేసినట్లుగా సమాచారం. దాదాపు రూ. 14 కోట్లు వెచ్చించి మరీ లైగర్ సినిమా ఆడియో రైట్స్ సొంతం చేసుకున్నట్లుగా టాక్. అలాగే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుందని.. శాటిలైట్ హక్కులను స్టా్ర్ నెట్ వర్క్ సొంతం చేసుకున్నట్లుగా సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లుగా వినికిడి. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఛార్మి, పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం విజయ్.. డైరెక్టర్ పూరి దర్శకత్వంలో జనగణమణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Viral Photo: ఈ డాడీ లిటిల్ ప్రిన్సెస్ ఎవరో గుర్తుపట్టారా..? తెలుగు కుర్రాళ్లకు దిల్ క్రష్ ఈ చిన్నది..

Tanushree Dutta: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ హీరోయిన్.. ఉజ్జయిని ఆలయానికి వెళ్తుండగా..

Degala Babji Movie: డేగల బాబ్జీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.. బండ్ల గణేష్ విడుదలయ్యేది అప్పుడే..

F3 Movie: ఈసారి సూపర్ హిట్ పక్కా.. ఎఫ్ 2 కి మించి ఉంటుంది.. ఎడిటర్ తమ్మిరాజు కామెంట్స్..