Beast OTT: ఓటీటీలోకి ‘బీస్ట్‌’ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే.. అధికారిక ప్రకటన..

Beast OTT: తమిళ స్టార్‌ హీరో విజయ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం 'బీస్ట్‌'. దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఏప్రిల్‌ 13న విడుదలైంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో పాన్‌ ఇండియా రేంజ్‌లో...

Beast OTT: ఓటీటీలోకి 'బీస్ట్‌' వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే.. అధికారిక ప్రకటన..
Beast Movie Ott Date
Follow us
Narender Vaitla

|

Updated on: May 04, 2022 | 1:17 PM

Beast OTT: తమిళ స్టార్‌ హీరో విజయ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బీస్ట్‌’. దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఏప్రిల్‌ 13న విడుదలైంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను మేకర్స్‌ ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా తమిళ్‌లో భారీ వసూళ్లను రాబట్టినప్పటికీ ఇతర భాషల్లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా విడుదలైనప్పుడే కేజీఎఫ్‌ చిత్రం రావడం, ఆ సినిమాకు దేశ వ్యాప్తంగా మంచి బజ్‌ ఉండడంతో బీస్ట్‌ వసూళ్లపై ప్రభావం పడింది.

అయితే విజయ్‌ ఫ్యాన్స్‌కు మాత్రం ఈ సినిమా బాగా నచ్చిందనే చెప్పాలి. ఈ సినిమాలో ‘రా’ ఏజెంట్‌గా అద్భుతమైన నటనను కనబరిచారు విజయ్‌. ఓ షాపింగ్‌ మాల్‌ను టెర్రరిస్ట్‌లు హైజాక్‌ చేస్తే, అందులో ఉన్న ప్రజలను హీరో ఎలా రక్షించాడన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. సిల్వర్‌ స్క్రీన్‌పై సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. నిజానికి ఊహించిన దాని కంటే ముందే బీస్ట్‌ డిజిటల్‌ ఎంట్రీ ఇస్తోంది.

ఈ సినిమాను మే 11న స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా ఓ ట్వీట్ చేసింది. మే 11న తమిళ్‌, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో బీస్ట్‌ విడుదల కానున్నట్లు ట్వీట్ చేశారు. దీంతో విజయ్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: Telangana: ఏకాంతంగా ఉన్నప్పుడు అటాక్.. మర్మాంగాలను ఛిద్రం చేసి.. చేసింది అతడే..

Wedding Viral Video: సన్నికల్లు తొక్కమంటే.. ఏకంగా పెళ్లికూతురినే..! నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఫన్నీ వీడియో..

Robotic Mouse Viral Video: శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు సరికొత్త రోబో ర్యాట్‌.. చుస్తే షాకే..