Telangana: ఏకాంతంగా ఉన్నప్పుడు అటాక్.. మర్మాంగాలను ఛిద్రం చేసి.. చేసింది అతడే..

అబ్దుల్లాపూర్‌మెట్‌ డబుల్‌మర్డర్‌ కేసులో మరో ట్విస్ట్‌. జ్యోతి భర్త శ్రీనివాసే హంతకుడని తేల్చారు పోలీసులు.

Telangana: ఏకాంతంగా ఉన్నప్పుడు అటాక్.. మర్మాంగాలను ఛిద్రం చేసి.. చేసింది అతడే..
మృతుడు యశ్వంత్‌
Follow us
Ram Naramaneni

| Edited By: Ravi Kiran

Updated on: May 04, 2022 | 5:19 PM

Ranga Reddy District : రంగారెడ్డిజిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో డబుల్‌ మర్డర్‌ మిస్టరీని చేధించారు పోలీసులు. చనిపోయింది జ్యోతి-యశ్వంత్‌లుగా ఐడెంటిఫై చేసిన పోలీసులు సీరియస్‌గా విచారణ చేపట్టారు. వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన ఖాకీలు..స్పాట్లో దొరికిన ఆధారాలతోపాటు టెక్నికల్‌ ఎవిడెన్స్‌ను ఉపయోగించి కేసు మిస్టరీని చేధించి జ్యోతి భర్త శ్రీనివాసే హంతకుడని తేల్చేశారు. కొత్తగూడెం బ్రిడ్జి సమీపంలో కంపచెట్ల మధ్య కుళ్లిపోయిన స్థితిలో రెండు మృతదేహాలను గుర్తించారు పోలీసులు. భరించలేని వాసన వస్తుండటంతో స్తానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. డాగ్‌స్క్వాడ్‌తో స్పాట్‌కు చేరుకున్న పోలీసులు హ్యాండ్‌బ్యాగ్‌తో పాటు హోండా యాక్టివాను స్వాధీనం చేసుకున్నారు. బండి నెంబర్‌ ఆధారంగా చనిపోయింది యశ్వంత్‌గా గుర్తించారు. అలాగే హ్యాండ్‌బ్యాగ్‌లో దొరికిన వివరాల ఆధారంగా జ్యోతిని ఐడెంటిఫై చేసి కుటుంబసభ్యులకి సమాచారమిచ్చారు.

వారాసిగూడకు చెందిన యశ్వంత్‌ డ్రైవర్‌. ఆదివారం మధ్యాహ్నం తన సోదరుడి బైక్ తీసుకుని బయటకు వెళ్లాడు. సాయంత్రం వచ్చి మళ్లీ వెళ్లిపోయాడు. అలా వెళ్లిన యశ్వంత్ తిరిగి ఇంటికి రాలేదు. ప్రొఫెషన్ డ్రైవర్‌ కావడంతో కుటుంబసభ్యులు పెద్దగా కంగారుపడలేదు. మరోవైపు జ్యోతి కూడా అదే ప్రాంతం నుంచి వెళ్లిపోయింది. ఐతే వాళ్లిద్దరూ చనిపోయినట్టు కుటుంబసభ్యులకి పోలీసులు సమాచారమిచ్చారు.

జ్యోతికి పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొద్దిరోజులుగా భర్తతో గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. యశ్వంత్‌తో జ్యోతి వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించిన భర్త చాలాసార్లు ఆమెను మందలించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే మేడే రోజున ఇద్దరు హత్యకు గురవ్వడం కలకలం రేపుతోంది.

Also Read: Konaseema: డాక్టర్ కోర్సు చదివి ఇదేం పనిరా రాస్కెల్.. సెవెన్త్ క్లాస్ బాలిక టెర్రస్‌పై నిద్రిస్తుండగా..