AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: మహానటి ఆశలన్నీ మహేష్ సినిమా పైనే.. ఈ సారి కీర్తి గట్టెక్కేనా..?

సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ ఉన్న వాళ్లకే ఆదరణ ఉంటుంది. ఒక సినిమా హిట్ అయితేనే మరో సినిమా ఛాన్స్ వస్తుంది. వరుసగా రెండూ మూడు ఫ్లాప్స్ వచ్చాయా..? అంతే సంగతులు.

Keerthy Suresh: మహానటి ఆశలన్నీ మహేష్ సినిమా పైనే.. ఈ సారి కీర్తి గట్టెక్కేనా..?
Keerthy Suresh
Follow us
Rajeev Rayala

|

Updated on: May 04, 2022 | 9:03 PM

సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ ఉన్న వాళ్లకే ఆదరణ ఉంటుంది. ఒక సినిమా హిట్ అయితేనే మరో సినిమా ఛాన్స్ వస్తుంది. వరుసగా రెండూ మూడు ఫ్లాప్స్ వచ్చాయా..? అంతే సంగతులు.. కెరీర్‌ అటకెక్కినట్టే. ఆల్మోస్ట్‌ అలాంటి సిచ్యుయేషన్‌లోనే ఉన్నారు మహానటి కీర్తి సురేష్‌(Keerthy Suresh). వరుస ప్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు ఆశలన్నీ తన నెక్ట్స్ సినిమా మీదే పెట్టుకున్నారు. కీర్తి సురేష్‌… స్టార్ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. హిట్‌ ట్రాక్‌లోకి రావటంలో మాత్రం ఇప్పటికీ తడబడుతూనే ఉన్నారు. మల్టీ లింగ్యువల్ స్టార్‌గా ఎదిగినా.. సక్సెస్‌ ఫుల్ హీరోయిన్‌ అన్న ట్యాగ్ మాత్రం అందుకోలేకపోతున్నారు. మహానటి సినిమాతో నేషనల్ ఫేమ్ సాధించిన కీర్తి.. ఆ క్రేజ్‌ను పర్ఫెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోవటంలో ఫెయిల్ అవుతూనే ఉన్నారు. మహానటి తరువాత కీర్తి కెరీర్‌లో ఒక్క బ్లాక్ బస్టర్ సినిమా కూడా పడలేదు. రంగ్‌ దే డీసెంట్ హిట్టే అయినా.. కీర్తి కెరీర్‌కు మాత్రం ప్లస్ కాలేదు.

స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు వస్తున్నా.. హిట్ అన్న మాట మాత్రం అందని ద్రాక్షగానే ఊరిస్తోంది. దీంతో సరైన సక్సెస్ కోసం చాలా కాలంగా వెయిట్‌ చేస్తున్నారు కీర్తి సురేష్‌. భారీ ఆశలతో చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు కీర్తి కెరీర్‌ను గాడిలో పెట్టకపోగా మరింతగా కష్టాల్లోకి నెట్టాయి. కోవిడ్‌ టైమ్‌లో రిలీజ్‌ అయిన పెంగ్విన్‌, మిస్ ఇండియా సినిమాలకు డిజాస్టర్ టాక్ రావటంతో.. కీర్తి మూవీ సెలక్షన్ మీదే అనుమానాలు మొదలయ్యాయి. రీసెంట్‌గా గుడ్‌ లఖ్ సఖి సినిమాతోనూ మరోసారి నిరాశపరిచారు కీర్తి సురేష్‌. డిజిటల్ రిలీజ్ అయిన చిన్ని సినిమాలో డిఫరెంట్‌ లుక్‌ ట్రై చేస్తున్నా పెద్దగా బజ్‌ రావటం లేదు. దీంతో మహేష్ బాబుకు జోడిగా నటిస్తున్న సర్కారువారి పాట మీదే ఆశలు పెట్టుకున్నారీ కళావతి. ఈ మూవీ పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కావటంతో సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్‌ కూడా సినిమా మీద హైప్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది. దీంతో ఆశలన్నీ ఈ మూవీ మీదే పెట్టుకున్నారు కీర్తి సురేష్‌. మరి సర్కారువారి పాట అయినా… ఈ బ్యూటీ కెరీర్‌ను గాడిలో పెడుతుందేమో చూడాలి.

Beast OTT: ఓటీటీలోకి ‘బీస్ట్‌’ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే.. అధికారిక ప్రకటన..

Viral Video: ఎయిర్ పోర్టులో లగేజీ ట్రాలీతో పరుగులు పెట్టిన సీత.. షాకైన ప్రయాణికులు..