Yashoda: ఆకట్టుకుంటున్న యశోద మూవీ ఫస్ట్ గ్లింప్స్.. చూస్తే థ్రిల్ అవ్వాల్సిందే

అందాల సమంత నటిస్తున్న లేటెస్ట్ మూవీ యశోద. విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది.

Yashoda: ఆకట్టుకుంటున్న యశోద మూవీ ఫస్ట్ గ్లింప్స్.. చూస్తే థ్రిల్ అవ్వాల్సిందే
Samanatha
Follow us
Rajeev Rayala

|

Updated on: May 05, 2022 | 1:02 PM

అందాల సమంత(Samantha)నటిస్తున్న లేటెస్ట్ మూవీ యశోద(Yashoda). విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. ఆమె షేర్ చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతుంది. ఒక వైపు చేతినిండా సినిమాలతో మరో వైపు ఒకటి రెండు బిజినెస్ లతో ఫుల్ బిజిగా గడుపుతోంది సామ్. తెలుగులోనే కాకుండా.. బాలీవుడ్, కోలీవుడ్‏లోనూ పాగా వేసేందుకు సిద్ధమైంది సామ్. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో నేషనల్ స్టార్‌గా ఎదిగారు. ఇక యశోద విషయానికొస్తే.. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాతో హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు.

తాజాగా ఈ సినిమానుంచి గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ వీడియోలో సమంత ఒక బెడ్ పై నుంచి కళ్లు తెరిచి చూస్తూ.. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. తాను వేరే లోకంలో ఉన్నట్టు.. తనకూ  అక్కడున్న ప్రదేశానికి సంబంధం లేదు అన్నట్టు అయోమయంగా కనిపించింది. బెడ్ మీద నుంచి కిందికి దిగి నడుచుకుంటూ వెళ్లి కిటికిలోనుంచి బయట ఉన్న పావురాన్ని అందుకోవడానికి ట్రై చేస్తుంది. ఆ తర్వాత సమంత ఉన్న ప్రదేశాన్నిఓ పజిల్ లా చూపించారు. అసలు సమంత అక్కడ ఎందుకు ఉంది.? ఆమెకు ఏమైంది..? అనే అంశాలు ఇంట్రస్టింగ్ గా అనిపించాయి. ఈ గ్లిమ్ప్స్ సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. యశోద సినిమాను ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేసింది చిత్రయూనిట్.

ఇవి కూడా చదవండి

Nora Fatehi : పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ

Keerthy Suresh: మహానటి ఆశలన్నీ మహేష్ సినిమా పైనే.. ఈ సారి కీర్తి గట్టెక్కేనా..?

Chiranjeevi: అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ కోసం పక్కా ప్లాన్‌తో రెడీ అవుతున్న మెగాస్టార్