AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చరిత్ర సృష్టించిన ట్రాన్స్‌జెండర్.. 301 ఓట్ల మెజారిటీతో సర్పంచ్‌గా మనీషా బాయి విజయం!

రాజస్థాన్ పంచాయతీ ఎన్నికల్లో ఓ అరుదైన విజయం అందరి దృష్టిని ఆకర్షించింది. ట్రాన్స్‌జెండర్ వర్గానికి చెందిన మనీషా బాయి సర్పంచ్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. కుశాల్‌పురా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆమె తన ప్రత్యర్థిపై 301 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ విజయంతో గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. మనీషా బాయి గెలుపు స్థానికంగా మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

చరిత్ర సృష్టించిన ట్రాన్స్‌జెండర్.. 301 ఓట్ల మెజారిటీతో సర్పంచ్‌గా మనీషా బాయి విజయం!
Transgender Sarpanch
Balaraju Goud
|

Updated on: Nov 18, 2026 | 9:07 AM

Share

రాజస్థాన్ పంచాయతీ ఎన్నికల్లో ఓ అరుదైన విజయం అందరి దృష్టిని ఆకర్షించింది. ట్రాన్స్‌జెండర్ వర్గానికి చెందిన మనీషా బాయి సర్పంచ్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. కుశాల్‌పురా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆమె తన ప్రత్యర్థిపై 301 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ విజయంతో గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. మనీషా బాయి గెలుపు స్థానికంగా మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్యంలో కులం, మతం, లింగభేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ నాయకత్వం వహించే అవకాశం ఉంటుందని ఆమె విజయం మరోసారి నిరూపించింది.

సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టనున్న మనీషా బాయి ముందున్న ప్రధాన లక్ష్యం గ్రామ అభివృద్ధి. ముఖ్యంగా గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం, రహదారుల నిర్మాణం, విద్యుత్ సౌకర్యాల మెరుగుదల, విద్య, పారిశుధ్యం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తానని మనీషా బాయి తెలిపారు. అలాగే అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవడం తన ప్రాధాన్యతల్లో ఒకటిగా పేర్కొంటున్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు.

ఇదిలా ఉండగా, రాజస్థాన్‌లో ‘ఒకే రాష్ట్రం-ఒకే ఎన్నిక’ విధానంలో పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. పట్టణ సంస్థల ఎన్నికల అనంతరం పంచాయతీ ఎన్నికలను నాలుగు దశల్లో చేపట్టారు. సోమవారంతో నాలుగో దశ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. సర్పంచ్, వార్డు పంచ్ ఎన్నికల ఫలితాలను సోమవారం (నవంబర్ 16) ప్రకటించారు. జిల్లా పరిషత్, పంచాయతీ సమితి సభ్యుల ఎన్నికల ఫలితాలను నవంబర్ 20న వెల్లడించనున్నారు. అనంతరం జిల్లా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పంచాయతీ సమితి ప్రధానులు, ఉప ప్రధానుల ఎన్నికలు జరగనున్నాయి. మొత్తానికి, 301 ఓట్ల మెజారిటీతో మనీషా బాయి సాధించిన విజయం ప్రజాస్వామ్య స్ఫూర్తికి, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us