బుద్ధుడి తలపై నత్తలు ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనుక ఆసక్తికరమైన కథ!

18 November 2026

Subhash

బుద్ధుడి విగ్రహాలను ఎప్పుడైనా నిశితంగా గమనించారా? ఆయన తలపై చిన్న చిన్న నత్తల ఆకారాలు కనిపిస్తుంటాయి. అసలు అవి ఎందుకు అలా ఉంటాయి? వాటి వెనుక ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది.

బుద్ధుడి

ఒకరోజు బుద్ధుడు చెట్టు కింద గాఢమైన ధ్యానంలో కూర్చున్నారట. ధ్యానంలో పూర్తిగా నిమగ్నమై సమయం గడుస్తున్న విషయాన్ని కూడా పట్టించుకోలేదట. ఎండ తీవ్రత పెరుగుతున్నా ఆయన ధ్యానం కొనసాగించారట.

ధ్యానంలో

బుద్ధుడి పరిస్థితిని గమనించిన కొన్ని నత్తలు ఆయన తలకు చేరి ఎండ వేడి నుంచి రక్షించాలనే ఉద్దేశంతో అక్కడ చేరాయని చెబుతారు. వాటి తడి శరీరాలు ఆయన తలకు చల్లదనాన్ని ఇచ్చాయట.

నత్తలు

ఒకదాని తర్వాత మరొకటి నత్తలు బుద్ధుడి తలపైకి చేరాయట. మొత్తం 108 నత్తలు ఆయన తలపై చేరి ఎండ నుంచి రక్షించాయని చెబుతారు. ఎండ వేడికి అవి ప్రాణాలు కోల్పోయాయని చెబుతుంటారు.

నత్తల త్యాగం!

వాస్తవానికి బుద్ధుడి విగ్రహాల్లో కనిపించేవి నత్తలు కావు. అవి ఆయన జుట్టును సూచించే చిన్న చిన్న మెలికల ఆకారాలు. వీటిని ఆంగ్లంలో Snail-shell curls అని కూడా పిలుస్తారు.

విగ్రహాల్లో

బుద్ధుడి తల పైభాగంలో కనిపించే ఎత్తైన భాగాన్ని ఉష్ణీష  అంటారు. బౌద్ధ కళలో ఇది ఆధ్యాత్మిక ఉన్నతిని, జ్ఞానాన్ని సూచించే ప్రత్యేక లక్షణంగా చిత్రించబడుతుంది. 

తలపై

బౌద్ధ శిల్పకళలో ఈ మెలికల జుట్టు శైలి ప్రాచీన భారతీయ శిల్పాల్లో కనిపిస్తుంది. అయితే 108 నత్తలు బుద్ధుడిని రక్షించాయనే కథకు ప్రాచీన బౌద్ధ గ్రంథాల్లో స్పష్టమైన ఆధారం లేదు.

చరిత్ర

నత్తల కథ చారిత్రకంగా నిరూపితమైనది కాకపోయినా, చిన్న జీవుల పట్ల కూడా కరుణ చూపాలనే గొప్ప సందేశాన్ని అందిస్తుంది. బుద్ధుడి బోధనల్లో అహింస, కరుణ, ప్రశాంతతకు ఎంతో ప్రాధాన్యం ఉంది.

సందేశం ఏమిటి?