Kajal Aggarwal : షాకింగ్ నిర్ణయం తీసుకున్న చందమామ కాజల్.. షాక్ లో అభిమానులు.

లక్ష్మీకళ్యాణం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల చందమామ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal). తొలి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ చిన్నది.

Kajal Aggarwal : షాకింగ్ నిర్ణయం తీసుకున్న చందమామ కాజల్.. షాక్ లో అభిమానులు.
Kajal
Follow us
Rajeev Rayala

|

Updated on: May 05, 2022 | 12:29 PM

లక్ష్మీకళ్యాణం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల చందమామ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal). తొలి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ చిన్నది. ఆతర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమా ఈ అమ్మడి అదృష్టాన్ని మార్చేసింది. మగధీర సినిమా సూపర్ హిట్ అవ్వడంతో కాజల్ కెరీర్ ఊపందుకుంది. అక్కడి నుంచి ఈ అమ్మడు వరుస సినిమాలతో దూసుకుపోయింది. తెలుగుతోపాటు తమిళ్ లోనూ ఈ చిన్నది ఆఫర్లు అందుకుంది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది ఈ చిన్నది. కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే పెళ్ళాడి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది కాజల్. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. ఇటీవల పండండి మగ బిడ్డకు కాజల్ జన్మినిచ్చిన సంగతి తెలిసిందే. తమ కొడుకు నీల్ కిచ్లూ అనే పేరును పెట్టినట్లు కాజల్ భర్త గౌతమ్ కిచ్లూ ఇటీవలే తన ఇన్ స్టా ఖాతా ద్వారా తెలియజేశాడు.

ఇదిలా ఉంటే కాజల్ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమలో నటించింది. కానీ ఏమైందో ఏమో కానీ ఆమె సినిమాలో నటించిన సన్నివేశాలను తొలగించారు దర్శకుడు కొరటాల శివ. ఇదిలా ఉంటే బిడ్డకు జన్మనించిన తర్వాత కాజల్ పూర్తిగా మారిపోయింది. దాంతో కొందరు కాజల్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేశారు. వారికీ స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చింది కాజల్. అయితే ఇప్పుడు కాజల్ పూర్తిగా సినిమాలను వదిలేస్తుందని టాక్ వినిపిస్తుంది. తన కుమారుడికే తన మొత్తం సమయాన్ని కేటాయించాలని కాజల్ నిర్ణయించుకుందట. సినిమాలలో నటిస్తే కొడుకుని చూసుకోవడానికి సమయం ఉండదనే ఆలోచనతో.. పూర్తిగా సినిమాలకు దూరం కావాలనే నిర్ణయానికి వచ్చిందట చందమామ. దాంతో కాజల్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాలంటే కాజల్ స్పందించాల్సిందే.

ఇవి కూడా చదవండి

Nora Fatehi : పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ

Keerthy Suresh: మహానటి ఆశలన్నీ మహేష్ సినిమా పైనే.. ఈ సారి కీర్తి గట్టెక్కేనా..?

Chiranjeevi: అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ కోసం పక్కా ప్లాన్‌తో రెడీ అవుతున్న మెగాస్టార్