AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’లో ఆ రెండు పాటల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్

ట్రిపులార్ మూవీ.. థియేటర్ రన్ దాదాపుగా కంప్లీటైనట్టే. టాలీవుడ్ నుంచి ఎమర్జ్ అయిన లేటెస్ట్ ప్రౌడ్ ప్రజెంటేషన్ ట్రిపులార్‌ని దాదాపు ప్రేక్షక లోకమంతా ఎంజాయ్ చేసింది.

RRR Movie: 'ఆర్ఆర్ఆర్'లో ఆ రెండు పాటల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్
Rrr
Rajeev Rayala
|

Updated on: May 05, 2022 | 12:43 PM

Share

ట్రిపులార్(RRR) మూవీ.. థియేటర్ రన్ దాదాపుగా కంప్లీటైనట్టే. టాలీవుడ్ నుంచి ఎమర్జ్ అయిన లేటెస్ట్ ప్రౌడ్ ప్రజెంటేషన్ ట్రిపులార్‌ని దాదాపు ప్రేక్షక లోకమంతా ఎంజాయ్ చేసింది. కానీ.. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్‌ని చాకచక్యంగా షురూ చేస్తూ ఇప్పటికీ రిపీట్ ఆడియన్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే రెండు సాలిడ్ వీడియో సాంగ్స్‌ని చివరివరకూ దాచిపెట్టేశారా.. అంటే అవును అనే టాక్ వినిపిస్తుంది. ట్రిపులార్‌ స్టోరీలోకి ఆడియన్స్‌ని డ్రైవ్ చేసిన ట్రిగ్గర్‌ పాయింట్‌ లాంటి పాట కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా. సినిమా రిలీజ్ కాగానే.. మొదటగా ఈ స్వీట్ మెలోడీ వీడియోనే బైటికొదిలారు. ఆ తర్వాత నాటునాటు పాట పూర్తి పాఠాన్ని చెబుతూ తారక్‌-చెర్రీ డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌తో ఫ్యాన్స్‌కి ఫుల్ ఫీస్ట్‌ నిచ్చారు. ఆ వెంటనే సైన్‌-ఆఫ్‌ సాంగ్‌ ఎత్తర జెండాలో తన ఆర్టిస్టులతో కలిసి జక్కన్న కూడా కాలూచెయ్యీ కదిపిన వైనాన్ని రివీల్ చేశారు. ఇద్దరు హీరోల దోస్తీ పాటను కూడా బైటపెట్టేశారు. ఇంతవరకూ ఓపిగ్గా ఉన్న ఫ్యాన్స్‌… సినిమాకు ఆయువుపట్టు లాంటి రామమ్‌ రాఘవమ్, కొమురం భీముడో పాటల సంగతేంటి అని నెట్లో నిలదీయ్యడం మొదలైంది. రామమ్‌ రాఘవమ్ పాట క్లయిమాక్స్‌ని రక్తి కట్టిస్తే.. కొమురం భీముడో ప్రీక్లయిమాక్స్‌కి ప్రాణం పోసింది.

జూనియర్ ఎన్టీయార్ అభిమానులైతే.. ట్రిపులార్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌లో మేజర్‌ థింగ్ తమ హీరో సోలో సాంగేనని గట్టిగా చెప్పుకుంటున్నారు. కొమురం భీముడో పాటలో శిక్ష వేసే చరణ్‌ కంటే, ఆ శిక్షను అనుభవించే తారక్కే ప్రాణం పెట్టి నటించారని సర్టిఫై చేసుకుంటున్నారు. అందుకే.. ఆ పాట వీడియో వెర్షన్‌ వచ్చేదాకా ఓపిక పట్టలేక ఇలా శాటిస్‌ఫై ఔతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా హార్డ్‌కోర్ ఫ్యాన్స్‌ అందరూ పూనుకుని డజన్ల కొద్దీ స్పూఫ్ వీడియోలతో కొమురం భీముడో పాటకు ముందస్తుగానే పట్టం కట్టేస్తున్నారు. ఆ రెండు ఒరిజినల్ వీడియో సాంగ్స్ కనుక రిలీజైతే… ట్రిపులార్ సినిమా టోటల్‌ కంటెంట్‌ రివీలైనట్టే కనుక.. మేకర్స్‌ కూడా హైడ్‌ అండ్ సీక్ ఆడుతూనే ఉన్నారు.

ఇవి కూడా చదవండి

Nora Fatehi : పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ

Keerthy Suresh: మహానటి ఆశలన్నీ మహేష్ సినిమా పైనే.. ఈ సారి కీర్తి గట్టెక్కేనా..?

Chiranjeevi: అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ కోసం పక్కా ప్లాన్‌తో రెడీ అవుతున్న మెగాస్టార్

2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..