27 బంతుల్లో 162 పరుగులు.. 27 సిక్సర్లతో బౌలర్ల ఊచకోత.. విధ్వంసం సృష్టించిన బ్యాటర్ ఎవరంటే!

45 ఓవర్ల మ్యాచ్.. అంటే 270 బంతులు.. బహుశా జట్టు 300 పరుగులు మహా అయితే 350 పరుగులు చేసి ఉంటుందని అనుకుంటున్నారు కదూ!

27 బంతుల్లో 162 పరుగులు.. 27 సిక్సర్లతో బౌలర్ల ఊచకోత.. విధ్వంసం సృష్టించిన బ్యాటర్ ఎవరంటే!
Liam Livingstone
Follow us

|

Updated on: May 05, 2022 | 9:00 PM

45 ఓవర్ల మ్యాచ్.. అంటే 270 బంతులు.. బహుశా జట్టు 300 పరుగులు మహా అయితే 350 పరుగులు చేసి ఉంటుందని అనుకుంటున్నారు కదూ! అయితే మీరు పప్పులో కాలేసినట్లే.. బ్యాటింగ్‌కు దిగిన టీం ఏకంగా 7 వికెట్ల నష్టానికి 579 పరుగులు చేసింది. అందులోనూ వన్ డౌన్‌లో దిగిన బ్యాట్స్‌మెన్ ఏకంగా 350 పరుగులు చేశాడు. 27 సిక్సర్లతో బౌలర్లపై వీరవిహారం చేశాడు. అతడెవరో కాదు లియామ్ లివింగ్‌స్టన్. ఈ ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సరిగ్గా ఏడేళ్ల క్రితం డొమెస్టిక్ క్రికెట్‌లో పెను విధ్వంసం సృష్టించాడు.

ప్రస్తుతం ఐపీఎల్ 2022లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతోన్న లియామ్ లివింగ్‌స్టన్.. 21 ఏళ్ల వయస్సులో డొమెస్టిక్ క్రికెట్‌లో బౌలర్ల భరతం పట్టాడు. నాంట్‌విచ్ క్రికెట్ క్లబ్‌ తరపున బరిలోకి దిగిన లియామ్ లివింగ్‌స్టన్ 128 బంతుల్లో 350 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో లివింగ్‌స్టన్ 27 సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. అటు 350 పరుగులలో 162 పరుగులు కేవలం సిక్సర్ల రూపంలోనే రావడం గమనార్హం. లివింగ్‌స్టన్ భారీ ఇన్నింగ్స్‌కు నాంట్‌విచ్ క్రికెట్ క్లబ్‌ 45 ఓవర్లకు 7 వికెట్లకు 579 పరుగులు చేయగా.. ప్రత్యర్థి జట్టు కేవలం 79 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా నాంట్‌విచ్ క్రికెట్ క్లబ్‌ 500 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే