DC vs SRH Highlights: వార్నర్, పావెల్‌ల మెరుపు ఇన్నింగ్స్.. 21 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం..

Basha Shek

| Edited By: Srinivas Chekkilla

Updated on: May 05, 2022 | 11:54 PM

IPL 2022: ఐపీఎల్‌ 2022లో భాగంగా ముంబైలోని బ్రాబౌర్న్ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.

DC vs SRH Highlights: వార్నర్, పావెల్‌ల మెరుపు ఇన్నింగ్స్.. 21 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం..
Dc Vs Srh

ఐపీఎల్‌ 2022లో భాగంగా ముంబైలోని బ్రాబౌర్న్ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్‌ వార్నర్ 58 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 92 పరుగులు చేశాడు. రోమన్‌ పొవెల్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 67 పరుగులు చేశాడు.

Key Events

గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..

ఐపీఎల్ లో ఈ రెండు జట్లూ 20 సార్లు తలపడ్డాయి. హైదరాబాద్‌ 11 సార్లు నెగ్గగా, ఢిల్లీ 9 సార్లు గెలుపొందాయి.

పాయింట్ల పట్టికలో ఎక్కడ ఉన్నాయంటే..

ఐపీఎల్‌-2022లో 9 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ 4 విజయాలు, 5 ఓటములతో లీగ్ పట్టికలో 6వ స్థానంలో ఉంది. మరోవైపు హైదరాబాద్ 5 మ్యాచ్‌ల్లో విజయం విజయం సాధించింది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 05 May 2022 11:35 PM (IST)

    21 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం

    హైదరాబాద్‌పై ఢిల్లీ 21 పరుగుల తేడాతో గెలుపొందింది.

  • 05 May 2022 11:30 PM (IST)

    8వ వికెట్ కోల్పోయిన హైదరాబాద్‌

    సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది.

  • 05 May 2022 11:23 PM (IST)

    పురాన్‌ ఔట్‌..

    హైదరాబాద్‌ ఆరో వికెట్ కోల్పోయింది. నికోలాస్ పురాన్‌ ఔటయ్యాడు.

  • 05 May 2022 11:16 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన హైదరాబాద్‌

    హైదరాబాద్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. సేన్‌ అబ్బట్‌ ఔటయ్యాడు.

  • 05 May 2022 11:16 PM (IST)

    నికోలాస్‌ పురాన్‌ హాఫ్‌ సెంచరీ

    హైదరాబాద్‌ ఆటగాడు నికోలాస్‌ పురాన్‌ హాఫ్ సెంచరీ చేశాడు. 29  బంతుల్లో 50 పరుగులు చేశాడు.

  • 05 May 2022 11:01 PM (IST)

    ఐదో వికెట్‌ కోల్పోయిన హైదరాబాద్‌

    సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. శశాంక్‌ సింగ్‌ క్యాచ్‌ ఔటయ్యాడు.

  • 05 May 2022 10:48 PM (IST)

    నాలుగో వికెట్‌ కోల్పోయిన హైదరాబాద్‌

    సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నాలుగో వికెట్ కోల్పోయింది. కుల్దీప్‌ బౌలింగ్‌లో మర్‌క్రమ్‌ క్యాచ్‌ ఔటయ్యాడు.

  • 05 May 2022 10:18 PM (IST)

    రాహుల్‌ త్రిపాఠి ఔట్‌

    హైదరాబాద్‌ మూడో వికెట్ కోల్పోయింది. రాహుల్‌ త్రిపాఠి ఔటయ్యాడు.

  • 05 May 2022 10:00 PM (IST)

    హైదరాబాద్‌ రెండో వికెట్‌ డౌన్‌.. పెవిలియన్‌ చేరిన కేన్‌ మామ..

    హైదరాబాద్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. కెప్టెన్‌ విలియమ్సన్‌ (5) అన్రీ నోర్జ్టే బౌలింగ్లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 4.3 ఓవర్లలో 24/2.

  • 05 May 2022 09:43 PM (IST)

    సన్‌రైజర్స్‌కు షాక్‌.. మొదటి వికెట్‌ డౌన్‌..

    సన్‌రైజర్స్‌ మొదటి వికెట్‌ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న అభిషేక్‌ శర్మ (7) ఖలీల్‌ బౌలింగ్లో కుల్‌దీప్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులో విలియమ్సన్, రాహుల్‌ త్రిపాఠీ ఉన్నారు.

  • 05 May 2022 09:21 PM (IST)

    దంచి కొట్టిన ఢిల్లీ..

    ఢిల్లీ జట్టు దంచికొట్టింది. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసి ఏకంగా 207పరుగులు చేసింది. వార్నర్‌ (58 బంతుల్లో 92), రోవ్‌మన్‌ పావెల్‌ (35 బంతుల్లో 67) ధాటిగా ఆడారు. వీరిద్దరూ అభేద్యమైన నాలుగో వికెట్‌కు 66 బంతుల్లోనే 122 పరుగులు జోడించడం విశేషం.

  • 05 May 2022 09:16 PM (IST)

    పావెల్‌ మెరుపు అర్ధ సెంచరీ..

    రోవ్‌మన్‌ పావెల్‌ మెరుపు అర్ధ సెంచరీ (30 బంతుల్లో 55, 6 సిక్స్‌లు) సాధించాడు. మాలిక్‌ వేసిన చివరి ఓవర్‌ మొదటి బంతిని సిక్సర్‌గా మలిచి ఈ ఫీట్‌ను సాధించాడు పావెల్‌.

  • 05 May 2022 09:14 PM (IST)

    వంద దాటిన భాగస్వామ్యం..

    రోవ్‌మన్‌ పావెల్‌, వార్నర్ లు అజేయమైన 4 వికెట్‌కు కేవలం 63 బంతుల్లోనే వంద పరుగులు జోడించారు. రోవ్‌మన్‌ పావెల్‌ 30 బంతుల్లోనే 49 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు ఉండడం విశేషం. మరోవైపు వార్నర్‌ (92) సెంచరీకి చేరువలో ఉన్నాడు. 19 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ స్కోరు 188/3.

  • 05 May 2022 09:09 PM (IST)

    150 దాటిన ఢిల్లీ స్కోరు..

    ఢిల్లీ స్కోరు 150 పరుగులు దాటింది. డేవిడ్‌ వార్నర్‌ (48 బంతుల్లో 74) ధాటిగా ఆడుతున్నాడు. పావెల్‌ (28) కూడా వేగంగా రన్స్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం ఢిల్లీ స్కోరు 16 ఓవర్లు ముగిసే సరికి 150/3.

  • 05 May 2022 08:31 PM (IST)

    వార్నర్‌ అర్థ సెంచరీ.. ఢిల్లీ సెంచరీ..

    ఐపీఎల్‌ టోర్నీలో తనను విడిచిపెట్టిన సన్‌రైజర్స్‌పై కసిగా ఆడుతున్నాడు వార్నర్‌. కేవలం 35 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. అతనికి తోడుగా రోవ్‌మాన్‌ పావెల్‌ (9) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం ఆ జట్టు  స్కోరు 11.4 ఓవర్లలో 111/3.

  • 05 May 2022 08:19 PM (IST)

    హ్యాట్రిక్‌ సిక్సర్లు… అంతలోనే వికెట్‌..

    శ్రేయస్‌ గోపాల్‌ వేసిన 9 ఓవర్లో మూడు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో మొత్తం 22 పరుగులు పిండుకున్నాడు రిషభ్‌. అయితే దురదృష్టవశాత్తూ తర్వాతి బంతి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ అవ్వడంతో అతను పెవిలియన్‌ చేరక తప్పలేదు. కాగా మొత్తం 16 బంతులు ఎదుర్కొన్న పంత్ 26 పరుగులు చేశాడు. 9 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ స్కోరు 85/3.

  • 05 May 2022 08:10 PM (IST)

    కట్టుదిట్టంగా హైదరాబాద్‌ బౌలింగ్..

    ఢిల్లీ క్యాపిటల్స్‌ 50 పరుగులు పూర్తి చేసుకుంది. వార్నర్‌ 25 బంతుల్లో 40 (5 ఫోర్లు, ఒక సిక్స్‌) ధాటిగా ఆడుతుండగా, రిషభ్‌ పంత్‌ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 8 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ స్కోరు 62/2.

  • 05 May 2022 07:55 PM (IST)

    రెండో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ..

    ఢిల్లీ రెండో వికెట్‌ కోల్పోయింది. ఫాస్ట్‌ బౌలర్‌ సీన్‌ అబాట్‌ బౌలింగ్‌లో మిషెల్‌ మార్ష్‌ (10) అతనికే క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. మరోవైపు వార్నర్‌ (22) దూకుడుగా ఆడుతున్నాడు. ప్రస్తుతం ఢిల్లీ స్కోరు 4.3 ఓవర్లలో39/2.

  • 05 May 2022 07:38 PM (IST)

    ఢిల్లీకి మొదటి ఝలక్‌..

    బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ మొదటి ఓవర్లోనే వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌గా వచ్చిన మన్‌ దీప్‌ సింగ్‌ (0) భువనేశ్వర్‌ బౌలింగ్‌లో నికోలస్‌ పూరన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులో వార్నర్‌ (5), మిషెల్‌ మార్ష్‌ (5) ఉన్నారు.

  • 05 May 2022 07:18 PM (IST)

    ఇరు జట్లలో భారీ మార్పులు..

    ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున శ్రేయాస్ గోపాల్, కార్తీక్ త్యాగి, సీన్‌ అబాట్ అరంగేట్రం చేశారు. అదేవిధంగా ఢిల్లీ జట్టులో నాలుగు మార్పులు జరిగాయి.. పృథ్వీషా, అక్షర్‌, ముస్తాఫిజుర్‌, సర్కారియా స్థానాల్లో అన్రిచ్‌ నార్జ్టే, మన్‌దీప్‌సింగ్, రిపల్‌ పటేల్‌ ,ఖలీల్‌ అహ్మద్‌ బరిలోకి దిగుతున్నారు.

  • 05 May 2022 07:10 PM (IST)

    టాస్‌ గెలిచిన హైదరాబాద్‌.. బ్యాటింగ్‌కు దిగనున్న..

    ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ టాస్‌ గెలిచాడు. ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

Published On - May 05,2022 6:57 PM

Follow us