- Telugu News Photo Gallery IPL 2022 Medium pacer Sushant Mishra joins SRH as replacement for injured Saurabh Dubey in Telugu
IPL 2022: సన్‌రైజర్స్ జట్టులోకి మరో లెఫ్టార్మ్ పేసర్.. ధోనితో ఎలాంటి అనుబంధం ఉందో తెలుసా?
ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అద్భుతంగా ఆడుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఈ జట్టు ఆ తర్వాత వరుస విజయాలు సాధించింది. అయితే ఇప్పుడు మళ్లీ రెండు వరుస ఓటములు ఎదుర్కొంది. ఈక్రమంలో హ్యాట్రిక్ ఓటములను తప్పించుకోవడం యువ ఫాస్ట్ బౌలర్ సుశాంత్ మిశ్రాను జట్టులోకి చేర్చుకుంది.
Updated on: May 05, 2022 | 4:29 PM

ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అద్భుతంగా ఆడుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఈ జట్టు ఆ తర్వాత వరుస విజయాలు సాధించింది. అయితే ఇప్పుడు మళ్లీ రెండు వరుస ఓటములు ఎదుర్కొంది. ఈక్రమంలో హ్యాట్రిక్ ఓటములను తప్పించుకోవడం యువ ఫాస్ట్ బౌలర్ సుశాంత్ మిశ్రాను జట్టులోకి చేర్చుకుంది.

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సౌరబ్ దూబే వెన్న గాయం కారణంగా టోర్నీ మిగతామ్యాచ్‌లకు దూరమైనట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపాడు. అతని స్థానంలో ఎడమచేతి మీడియం పేసర్ సుశాంత్ మిశ్రాను జట్టులోకి తీసుకుంది ఎస్‌ఆర్‌హెచ్. కాగా ఈ సీజన్‌లో దూబే ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

కాగా సుశాంత్ ధోని నగరం రాంచీ నగరానికి చెందిన వాడు. 21 ఏళ్ల సుశాంత్ నాలుగు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు, అందులో 13 వికెట్లు పడగొట్టాడు. ప్రియమ్ గార్గ్ సారథ్యంలో సుశాంత్ అండర్- 19 వరల్డ్ కప్ ఫైనల్ కూడా ఆడాడు. సుశాంత్‌ను రూ. 20 లక్షల ధరతో జట్టులో చేరనున్నాడు.

సుశాంత్ మిశ్రా గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున నెట్ బౌలర్‌గా ఆడాడు. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తొమ్మిది మ్యాచ్‌ల్లో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈ జట్టు గురువారం బ్రబోర్న్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. మరి ఈ మ్యాచ్‌లో సుశాంత్‌కి అవకాశం దక్కుతుందో లేదో చూడాలి.