Rajeev Rayala |
Updated on: May 05, 2022 | 1:36 PM
‘పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్’ హీరో జానీ డెప్ పై అతడి మాజీ భార్య, హీరోయిన్ అంబర్ హర్డ్ సంచలన ఆరోపణలు చేసింది
తరచూ కొట్టేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. అతడి అరాచకాలు అన్నీఇన్నీ కావంటూ కోర్టు హాల్లోనే వెక్కివెక్కి ఏడ్చింది
తనను ఎప్పుడూ కొట్టేవాడని, తొలిసారి కొట్టినప్పుడు జోక్ అనుకుని నవ్వేశానని తెలిపింది.
ఒంటిపై చెరిగిపోయినట్టున్న టాటూ గురించి అడిగాను. ఏం రాసుందని ప్రశ్నించాను. ‘వినో’ అని రాసుకున్నానంటూ చెప్పిన జానీ.. నన్ను తొలిసారి కొట్టాడు
నోటితో చెప్పలేని బూతులు తిట్టాడని పేర్కొంది. ఆ రోజును, ఆ ఘటనను తానెప్పుడూ మరచిపోలేనని, తన జీవితాన్నే మార్చేసిందని విచారం వ్యక్తం చేసింది
తనపై దాడి ఆ ఒక్కసారితోనే ఆగిపోలేదని, పలుమార్లు అలాగే దాడిచేశాడని చెప్పుకొచ్చింది
మాదకద్రవ్యాలు, ఆల్కహాల్ మత్తులో దాడి చేసేవాడని తెలిపింది.
ఓ అమ్మాయితో అత్యంత సన్నిహితంగా ఉన్నాడని తెలిపింది. ఆ యువతి బట్టలు చింపేసి డ్రగ్స్ కోసం వెతికాడని, పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తం చేసింది