OTT Movies: ఓటీటీలోకి పాన్ ఇండియా మూవీస్ వచ్చేస్తున్నాయి.. డేట్స్ ఇవిగో.!
థియేటర్స్‌లో పాన్ ఇండియా మూవీస్ సందడి ముగిసింది.. ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్2', 'బీస్ట్'.. ఇలా ఒకటేమిటీ..
థియేటర్స్‌లో పాన్ ఇండియా మూవీస్ సందడి ముగిసింది.. ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్2’, ‘బీస్ట్’.. ఇలా ఒకటేమిటీ.. స్టార్ హీరోలు నటించిన పాన్ ఇండియన్ సినిమాలన్నీ కూడా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ముందుగా మే 11వ తేదీన దళపతి విజయ్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ‘బీస్ట్’ మూవీ సన్ నెక్స్ట్, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ప్రసారం కానుంది. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇక హిందీలో హిట్టు కొట్టిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం మే 13వ తేదీన జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
మరోవైపు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియన్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ మే 20వ తేదీ నుంచి జీ5, నెట్‌ఫ్లిక్స్‌లలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. తొలుత ఈ చిత్రాన్ని పే ఫోర్ వ్యూ పద్దతిలో విడుదల చేసి.. జూన్ 3వ తేదీ నుంచి సబ్‌స్కైబర్లకు అందుబాటులో ఉంచాలని రెండు ఓటీటీ సంస్థలు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక రాకీ భాయ్ ‘కేజీఎఫ్ 2’ మే 27వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అటు విజయ్ సేతుపతి, నయనతార, సమంతా కలిసి నటించిన ‘కాతువాకుల్ రెండు కాదల్’ చిత్రం డిస్నీ+హాట్‌స్టార్‌లో మే 26 నుంచి ప్రసారం కానుంది. కాగా, బాక్సాఫీస్ దగ్గర ఆశించినంత స్థాయిలో ప్రజాదరణ పొందని ‘ఆచార్య’ మూవీ ఓటీటీ రిలీజ్‌పై రూమర్స్ వస్తున్నాయి. మే20వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కావొచ్చునని అంటున్నారు. దీనిపై నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..