Viral: ‘బార్బీ డాల్’గా మారేందుకు సర్జరీలు చేయించుకున్న యువతి.. ఎంత ఖర్చు పెట్టిందో తెలిస్తే మైండ్ బ్లాంకే!

మనిషి అయినందుకు ఆశ పెట్టుకోవడంలో తప్పులేదు. కానీ ఆ ఆశ అత్యాశ కాకూడదు. ప్రతీ వ్యక్తి తాను మరింత యవ్వనంగా, అందంగా..

Viral: 'బార్బీ డాల్'గా మారేందుకు సర్జరీలు చేయించుకున్న యువతి.. ఎంత ఖర్చు పెట్టిందో తెలిస్తే మైండ్ బ్లాంకే!
Odd News
Follow us
Ravi Kiran

|

Updated on: May 04, 2022 | 8:41 PM

మనిషి అయినందుకు ఆశ పెట్టుకోవడంలో తప్పులేదు. కానీ ఆ ఆశ అత్యాశ కాకూడదు. ప్రతీ వ్యక్తి తాను మరింత యవ్వనంగా, అందంగా ఉండాలని కోరుకోవడం సహజం. అయితే అందుకోసం కొంతమంది శస్త్రచికిత్సలు కూడా చేయించుకుంటారు. సెలబ్రిటీల విషయంలో ఇలాంటి వాటి గురించి మనం తరచూ వింటుంటాం. అయితే ఇక్కడొక అమ్మాయికి బార్బీ డాల్ అంటే చాలా ఇష్టం. తనను తాను ఓ బార్బీ డాల్ అనుకుని ఊహించుకుంటుంది. ఎప్పటికైనా హ్యూమన్ బార్బీగా మారాలన్నది ఈమె కల. అందుకోసం ఆ అమ్మాయి ఏం చేసిందో చూస్తే మీరు షాక్ కావడం ఖాయం..

జర్మనీకి చెందిన ఈ యువతి పేరు జెస్సీ బన్నీ. వయసు 21 సంవత్సరాలు. ‘హ్యూమన్‌ బార్బీ’గా మారాలన్న తన కలను నిజం చేసుకోవడానికి సొంత కుటుంబాన్ని వదిలి ఆస్ట్రియాలోని వియెన్నాకు వచ్చేసింది. సుమారు 53.6 లక్షలు ఖర్చు చేసి మూడుసార్లు రొమ్ము పెరుగుదల శస్త్రచికిత్సలు చేయించుకుంది. పెదాలను బొద్దుగా మార్చుకుంది. ఇన్‌స్టాగ్రాం ఖాతాలో తన శరీర కొలతలను వెల్లడించింది. అయితే, రూపు మార్చుకున్న తర్వాత కుటుంబ సభ్యులెవరూ తనతో మాట్లాడటం లేదని వాపోయింది.

డ్రైవింగ్‌ క్లాసుల కోసం తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులను కూడా రొమ్ము పెరుగుదల చికిత్సకు ఖర్చు చేసినట్లు చెప్పింది జెస్సీ… తాను ఇప్పుడెంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నానని, త్వరలోనే పూర్తిస్థాయి బేబీ డాల్‌ మాదిరిగా కనిపించేలా శరీరాన్ని మార్చుకుంటానని వెల్లడించింది. కాగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో జెస్సీకి 78 వేల మంది ఫాలోవర్లున్నారు.

ఇవి కూడా చదవండి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన