AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: కూతురికి పెళ్లి చేసేందుకు అబ్బాయిని వెతికిన తండ్రి.. కట్ చేస్తే.. ఆమె చేసిన పనికి అంతా షాక్!

అమ్మాయిలు ఎంత ఎక్కువ చదువుకుంటే, వాళ్లను పెళ్లి చేసుకునే అబ్బాయిలు కూడా అంతకంటే ఎక్కువ పొజిషన్‌లో ఉండాలని కోరుకుంటారు...

Viral: కూతురికి పెళ్లి చేసేందుకు అబ్బాయిని వెతికిన తండ్రి.. కట్ చేస్తే.. ఆమె చేసిన పనికి అంతా షాక్!
Viral
Ravi Kiran
|

Updated on: May 03, 2022 | 5:28 PM

Share

అమ్మాయిలు ఎంత ఎక్కువ చదువుకుంటే, వాళ్లను పెళ్లి చేసుకునే అబ్బాయిలు కూడా అంతకంటే ఎక్కువ పొజిషన్‌లో ఉండాలని కోరుకుంటారు. అలాంటి అమ్మాయిలకు పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు కూడా అంతే కష్టపడాల్సి ఉంటుంది. అబ్బాయిని వెతికేందుకు పడరాని పాట్లు పడాల్సి ఉంటుంది. తీరా దొరికిన అబ్బాయి పెళ్లికి కాదు, తమ కంపెనీలో ఉద్యాగానికి పనికొస్తాడు..అంటూ ఓ యువతి తన తండ్రికి ఊహించని షాక్‌ ఇచ్చింది. కూతురికి పెళ్లి చేద్దామని మంచి అబ్బాయిని వెదికితే.. అతని ప్రొఫైల్ నచ్చి కంపెనీలో ఉద్యోగం ఇచ్చింది. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఆ తండ్రి కూతుళ్ల వాట్సాప్‌ చాటింగ్‌ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

సార్టప్ కంపెనీ కో ఫౌండర్ ఉదితా పాల్‌కు తగిన అబ్బాయిని చూసి వివాహం చేయాలనుకున్నాడు ఆమె తండ్రి..అందుకోసం మాట్రిమోనియల్‌ సైట్‌ను ఆశ్రయించాడు. అక్కడ ఎంతో సర్చ్‌ చేసి..ఓ తగిన అబ్బాయిని సెలెక్ట్‌ చేశాడు..అతని వివరాలను వాట్సాప్ ద్వారా కూతురు ఉదితా పాల్‌కు షేర్‌ చేశాడు.. అయితే అతని ప్రొఫైల్‌ చూసిన ఉదితా చాలా ఇంప్రెస్ అయింది. అతనికున్న క్వాలిఫికేషన్, అనుభవాన్ని చూసి ఫిదా అయింది. కానీ అతనిని పెళ్లి చేసుకోవాలనుకోలేదు.. అతనికి తన కంపెనీలో జాబ్ ఇచ్చింది.

దాంతో కంగుతిన్న ఆ తండ్రి…కూతురికి మరో మెసేజ్‌ చేశాడు..మ్యాట్రిమోనియల్ ‌సైట్ నుంచి వ్యక్తులను ఉద్యోగంలోకి తీసుకోలేమని, పెళ్లి కోసమని చెప్పాడు..అందుకు ఆమె..ఆ వ్యక్తికి ఫిన్‌టెక్‌లో ఏడేళ్ల అనుభవం ఉండటం వల్ల తన సంస్థలో ఉద్యోగం ఇచ్చానని చెప్పింది. పైగా తనను క్షమించమని తం‍డ్రికి రిప్లై ఇచ్చింది. ఆ తర్వాత ఉదితా పాల్ ఈ చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ తీసి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది.. దాంతో ఈ పోస్ట్‌ కాస్త ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..
వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..
హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలంటే కొత్త రూల్స్.. 10 అంతస్తులు దాటితే..
హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలంటే కొత్త రూల్స్.. 10 అంతస్తులు దాటితే..
తీపి తిన్నా షుగర్ పెరగదా? డయాబెటిస్ బాధితులకు బంపర్ గిఫ్ట్!
తీపి తిన్నా షుగర్ పెరగదా? డయాబెటిస్ బాధితులకు బంపర్ గిఫ్ట్!
మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో..
మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో..
ఈ టాలీవుడ్ హీరోయిన్ భర్త బలవంతంతోనే సినిమాలకు గుడ్ బై చెప్పిందా?
ఈ టాలీవుడ్ హీరోయిన్ భర్త బలవంతంతోనే సినిమాలకు గుడ్ బై చెప్పిందా?
శని దోషంతో ఆ రాశుల వారికి కష్టనష్టాలు..! ఊరట ఎప్పటినుంచంటే..?
శని దోషంతో ఆ రాశుల వారికి కష్టనష్టాలు..! ఊరట ఎప్పటినుంచంటే..?
చేజేతులా ఛాన్సులు పోగొట్టుకున్న దర్శకులు వీడియో
చేజేతులా ఛాన్సులు పోగొట్టుకున్న దర్శకులు వీడియో
అబూదాబీ BAPS హిందూ మందిరం సందర్శించిన యూఏఈ అధ్యక్షుడి సలహాదారు
అబూదాబీ BAPS హిందూ మందిరం సందర్శించిన యూఏఈ అధ్యక్షుడి సలహాదారు
ఫిబ్రవరిలో రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. ఇలా దరఖాస్తు చేసుకుంటేనే.
ఫిబ్రవరిలో రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. ఇలా దరఖాస్తు చేసుకుంటేనే.
పూర్వీకులు అరటి ఆకునే ఎందుకు ఎంచుకున్నారు..?ఆ రహస్యాలు తెలిస్తే..
పూర్వీకులు అరటి ఆకునే ఎందుకు ఎంచుకున్నారు..?ఆ రహస్యాలు తెలిస్తే..