Tallest Woman: ప్రపంచంలోనే ఎతైన మహిళ మరో మూడు గిన్నిస్ రికార్డులలు బద్దలు కొట్టింది.
ప్రపంచంలో చాలా వింతలు జరుగుతూ ఉంటాయి. మనకు తెలిసినివి కొన్నైతే మనకు తెలియనివి చాలానే ఉన్నాయి. అయితే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా ప్రపంచంలోనే మనకు తెలియని ఎన్నో వింతలు తెలుసుకోవచ్చు.
ప్రపంచంలో చాలా వింతలు జరుగుతూ ఉంటాయి. మనకు తెలిసినివి కొన్నైతే మనకు తెలియనివి చాలానే ఉన్నాయి. అయితే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా ప్రపంచంలోనే మనకు తెలియని ఎన్నో వింతలు తెలుసుకోవచ్చు. తాజాగా అత్యంత పొడవైన మహిళ రుమేసా గెల్గి మరో రికార్డులను బద్దలు కొట్టింది. అత్యంత ఎత్తైన మహిళగా పేరుపొందిన రుమేసా గెల్గి ఇప్పుడు మూడు అదనపు రికార్డులను బద్దలు కొట్టింది. రుమేసా గెల్గి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. గెల్గి జనవరి 1, 1997న జన్మించింది.
కాగా ఈమె న్యాయవాది, పరిశోధకురాలు ఫ్రంట్-ఎండ్ డెవలపర్.. ఆమె అక్టోబర్ 2021 నుండి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను కలిగి ఉంది. ఆమె మాట్లాడుతూ..నేను చిన్నతనంలో చాలా వేధింపులకు గురయ్యాను, కానీ పొడవుగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ను అందుకోవడమే అన్నారు. నేను యుక్తవయసులో 2014లో నా మొదటి రికార్డ్ టైటిల్‌ను అందుకున్నాను..ఈ సందర్భంగా గిన్నిస్ రికార్డ్ ని అందించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. రుమేసా గెల్గి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళ మరో మూడు గిన్నిస్ రికార్డులను బద్దలు కొట్టింది.