Viral Photo: ఈ ఫోటోలోని జంతువులను కనిపెడితే మీ కళ్లలో పవర్ ఉన్నట్లే.. 99% ఫెయిల్!

Photo Puzzle: ఆప్టికల్ ఇల్యూషన్.. మీ మెదడుకు మాత్రమే కాదు.. కళ్లకు కూడా పని చెప్పే గొప్ప పజిల్...

Viral Photo: ఈ ఫోటోలోని జంతువులను కనిపెడితే మీ కళ్లలో పవర్ ఉన్నట్లే.. 99% ఫెయిల్!
Optical Illusion
Follow us
Ravi Kiran

|

Updated on: May 03, 2022 | 7:55 PM

ఆప్టికల్ ఇల్యూషన్.. మీ మెదడుకు మాత్రమే కాదు.. కళ్లకు కూడా పని చెప్పే గొప్ప పజిల్. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. వీటిల్లో పైకి కనిపించేది ఒకటయితే.. లోపల మరొకటి ఉంటుంది. ఇక ఆ పజిల్‌ను సాల్వ్ చేసేందుకు నెటిజన్లు బాగా ఆసక్తిని చూపిస్తున్నారు. సవాళ్లను ఇష్టపడేవారయితే.. ఈ ఆప్టికల్ ఇల్యూషన్(Optical Illusion) చిత్రాలను తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పట్టేస్తున్నారు. మరి అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.

పైన పేర్కొన్న ఫోటోను చూశారా.? ఏం కనిపిస్తోంది.! మీరైతే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఠక్కున చెట్టు అని చెప్పేస్తారు. అయితే ఇక్కడే ఓ రహస్యం దాగుంది. అందులో ఐదు జంతువులు దాగున్నాయి. వాటిని గుర్తించడం చాలా కష్టం. మేధావులు కూడా ఈ పజిల్ సాల్వ్ చేయలేక చేతులెత్తేశారు. మరి మీరూ ఒకసారి ట్రై చేస్తారా.? అందులో జంతువులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించగలరా.? ఓటమిని ఒప్పుకోవద్దు.. లెట్స్ ట్రై వన్స్.. మీకో క్లూ.. ఇందులో రెండు కోళ్లు, మూడు కోడి పిల్లలు ఉన్నాయి.. వాటిని సరిగ్గా కనిపెట్టండి.. ఒకవేళ మీకు ఎంత వెతికినా దొరక్కపోతే.. సమాధానం కోసం కింద ఫోటోను చూడండి..

Also Read: