Viral Photo: తోపుడు బండి దగ్గర టిఫిన్ చేస్తున్న ఈ కోటీశ్వరుడిని గుర్తుపట్టారా.? ఈజీగా కనిపెట్టొచ్చు

Viral Photo: సోషల్ మీడియాలో తరచూ ఏదొక విషయం వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్నిసార్లు వీడియోలు అవుతుంటే..

Viral Photo: తోపుడు బండి దగ్గర టిఫిన్ చేస్తున్న ఈ  కోటీశ్వరుడిని గుర్తుపట్టారా.? ఈజీగా కనిపెట్టొచ్చు
Kiran Kumar Lalitha Jewell1
Follow us
Ravi Kiran

| Edited By: Ganesh Mudavath

Updated on: May 03, 2022 | 4:26 PM

సోషల్ మీడియాలో తరచూ ఏదొక విషయం వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్నిసార్లు వీడియోలు అవుతుంటే.. మరికొన్నిసార్లు సెలబ్రిటీల అన్‌సీన్ ఫోటోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఈ కోవలోనే తాజాగా ఓ ప్రముఖ సెలబ్రిటీ ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ ఫోటో ఏంటో లుక్కేద్దాం పదండి..

పైన ఫోటోలోని వ్యక్తిని చూశారా..? ఆయన్ని ఎక్కడో చూసినట్లు ఉంది కదూ.! అవునండీ.. మీరు కరెక్ట్ గానే గెస్ చేశారు.. ఆయన బుల్లితెర సెలబ్రిటీ.. ఆయన రూటే సెపరేటు.. తమ సంస్థను ప్రమోట్ చేసుకునేందుకు ఇతరులు హీరోలు, హీరోయిన్లతో లక్షలు ఖర్చు పెట్టి యాడ్స్ తీస్తుంటే.. ఈయన మాత్రం సోలోగా ప్రచారం చేస్తారు. తనకంటూ ఉన్న ప్రత్యేక శైలిలో వ్యూయర్స్‌ను భలేగా ఎట్రాక్ట్ చేస్తారు. ”కష్టపడి సంపాదించిన డబ్బును ఈజీగా వదులుకోవచ్చా”..”డబ్బులు ఎవరికీ ఊరికే రావంటూ” సోషల్ మీడియా ప్రపంచంలో ఓ సునామీ సృష్టించిన ఆయన మరెవరో కాదు లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్. తాజాగా ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్టార్ హోటల్‌లో తినగలిగే సత్తా ఉన్నప్పటికీ రోడ్ సైడ్ బండి వద్ద ఫ్రెండ్స్‌తో కలిసి టిఫిన్ తింటూ కనిపించారాయన. ఆ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. వీటిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కాగా, లలిత జ్యువెలర్స్ సంస్థను కిరణ్ కుమార్ 1999వ సంవత్సరంలో టేక్ ఓవర్ చేసిన విషయం విదితమే.

Kiran Kumar Lalitha Jewelle