Ration Card Rules: రేషన్ కార్డులకు కొత్త రూల్స్ ఇవే.. వారు కార్డ్ సరెండర్ చేయకపోతే చర్యలు తప్పవు..
Ration Card Rules: రెండేండ్ల క్రితం కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ అందించింది. కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ విధానాన్ని అప్పట్లో అమలు చేసిన సంగతి తెలిసిందే.
Ration Card Rules: రెండేండ్ల క్రితం కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ అందించింది. కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ విధానాన్ని అప్పట్లో అమలు చేసిన సంగతి తెలిసిందే. షనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్- 2013 కింద ఈ కార్డులను జారీ చేస్తారు. రేషన్ కార్డులనే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్(Food Safety Card) అని కూడా పిలుస్తారు. కానీ.. పలువురు కార్డు దారులు రేషన్ కార్డు పొందేందుకు అనర్హులైనప్పటికీ రేషన్, ఇతర ఉచితాలను(Free Ration) ఈ కార్డు ద్వారా పొందుతున్న విషయంపై కేంద్రం దృష్టి సారించింది. అనర్హులకు ఈ సౌకర్యాలు అందకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. అందువల్ల అనర్హులైన వారు తమ రేషన్ కార్డులను తక్షణం సరెండర్ చేయాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఒకవేళ అనర్హులైన కార్డుల యజమానులు తమ రేషన్ కార్డులను సరెండర్ చేయకపోతే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది.
అసలు రేషన్ కార్డు పొందేందుకు అర్హులు ఎవరు..?
గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000 లోపు, నగరప్రాంతాల్లో రూ.2,00,000 లోపు వార్షిక ఆదాయం ఉన్నవారు రేషన్ కార్డులు పొందేందుకు అర్హులు. రూ.3.5 ఎకరాల లోపు పంటపొలాలు, రూ.7.5 ఎకరాల లోపు బీడు భూమి ఉన్నవారు కూడా రేషన్ కార్డు తీసుకోవచ్చు. ఈ తాజా నిబంధనల ప్రకారం.. రూ.10 వేల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారిని మాత్రమే దారిద్య్రరేఖకు దిగువన ఉన్నకుటుంబాలుగా గుర్తించి కార్డు జారీ చేస్తారు. ఎల్లో రేషన్‌కార్డు పొందాలంటే.. కుటుంబంలో డాక్టర్, న్యాయవాది, ఆర్కిటెక్, చార్టర్డ్ అకౌంటెంట్ ఉండకూడదు. వార్షికాదాయం రూ.15 వేల వరకు ఉన్న కుటుంబాలు. ప్రొఫెషనల్ టాక్స్, సేల్స్ టాక్స్, ఇన్‌కమ్ టాక్స్ చెల్లించని కుటుంబాలు. రెసిడెన్షియల్‌లో ఫోన్, కారు, కుటుంబంలోని సభ్యులందరికీ కలిపి రెండు హెక్టార్ల మెట్ట, హెక్టార్ మాగాణి, కరువు ప్రాంతాల్లో అర్ధ హెక్టార్ భూమి కూడా లేని వారిని మాత్రమే అర్హలుగా పరిగణిస్తారు.
ఎవరెవరు రేషన్ కార్డు సరెండర్ చేయాలంటే..
అర్హతలు లేకపోయినా రేషన్ కార్డు పొందినా, ఉపయోగించినా చట్టపరంగా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనర్హులు రేషన్ కార్డుల్ని ఉపయోగిస్తున్నట్టైతే ప్రభుత్వానికి సరెండర్ చేయాలి. 100 చదరపు మీటర్ల కంటే ఎక్కువ నిడివి గల ఇల్లు లేదా ఫ్లాట్, కారు లేదా ట్రాక్టర్, గ్రామంలో రూ.2 లక్షలకంటే ఎక్కువ వార్షికాదాయం, నగరాల్లో రూ.3 లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయం గల వారు సంబంధిత తహసీల్దార్‌కు గానీ, డీఎస్‌వో ఆఫీసులో గానీ రేషన్ కార్డు సరెండర్ చేయాలి.
ఆంధ్రప్రదేశ్ లో ఇలా..
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డ్ రూల్స్ చూస్తే అర్బన్ ప్రాంతాల్లో రూ.75,000 లోపు వార్షికాదాయం, గ్రామీణ ప్రాంతాల్లో రూ.60,000 లోపు వార్షికాదాయం ఉన్నవారు రేషన్ కార్డ్ తీసుకోవచ్చు. ఐదు ఎకరాల లోపు భూమి ఉన్నవారు కూడా రేషన్ కార్డ్ పొందడానికి అర్హులు. 100 చదరపు మీటర్ల ప్లాట్, ఇల్లు, ఫ్లాట్, ఫోర్ వీలర్, కార్, ట్రాక్టర్, రూ.2 లక్షల కన్నా ఎక్కువ వార్షికాదాయం ఉన్నవారికి రేషన్ కార్డ్ ఇవ్వరు. ఒకవేళ వారు రేషన్ కార్డ్ ఉపయోగిస్తున్నట్లైతే తహసీల్దార్ ఆఫీసులో సరెండర్ చేయాలి. డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్ లాంటి ప్రొఫెషనల్స్ కూడా తమ దగ్గర రేషన్ కార్డ్ ఉంటే సరెండర్ చేయాలి. ప్రొఫెషనల్ ట్యాక్స్ పేయర్స్, సేల్స్ ట్యాక్స్ పేయర్స్, ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నవారు కూడా రేషన్ కార్డ్ సరెండర్ చేయాల్సి ఉంటుంది. గతంలో రేషన్ కార్డ్ తీసుకున్నవారు ఆర్థికంగా స్థిరపడినట్లైతే.. వారు కూడా ఇప్పుడు రేషన్ కార్డును ప్రభుత్వానికి సరెండర్ చేయాల్సిందే.
ఇవీ చదవండి..
Anand Mahindra: ఆమె స్టోరీపై స్పందించిన ఆనంద్ మహీంద్రా.. 700 మంది పురుషులకు సారధిగా మహిళ..
Hyderabad: కంపెనీలకు తెలంగాణ అడ్డాగా మారుతోందన్న మంత్రి కేటీఆర్.. రానున్న కాలంలో లక్షల్లో కొలువులు..