AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీరామనవమి

శ్రీరామనవమి

శ్రీరామచంద్రుడు మానవుడు దేవుడిగా మారి భక్తుల మదిలో కొలువై పూజలను అందుకున్నాడు. ఆసేతు హిమాచలం రామాలయం లేని వీధి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు వారు మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువూ శ్రీ రాముడిని తమ ఇలవేల్పుగా కొలుస్తుంది. శ్రీరాముడు త్రేతాయుగంలో వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి, గురువారము రోజు పునర్వసు నక్షత్రంలో అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో జన్మించినాడని నమ్మకం. అంతేకాదు ఈ రోజు సీతారాముల కళ్యాణం జరిగిందని.. శ్రీరాముడు రావణ సంహారం అనంతరం సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైన రోజు చైత్ర శుద్ధ నవమి అని నమ్మకం. అందుకనే ప్రతి ఏడాది చైత్ర శుక్లపక్ష నవమిని గొప్ప పండగగా జరుపుకుంటారు.

శ్రీరామ నవమి పండుగ రోజున అయోధ్యలో బాల రామయ్యకు జన్మ దిన వేడుకలను నిర్వహిస్తారు. రాముడంటే ఒకటే మాట, ఓకే బాణం..రాముడంటే సీతకు ప్రాణం.. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే రామాయణం. లోక కళ్యానమే శ్రీ సీతా రాముల కళ్యానం అంటూ యావత్ భరతం అంటే పట్టణం, పల్లెలు అనే తేడా లేకుండా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది అంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో చైత్రమాస శుద్ధ నవమి రోజున అంటే 06వ తేదీ ఏప్రిల్ 2025 ఆదివారంన శ్రీ రామ నవమి వేడుకలను జరుపుకోనున్నారు.

ఇప్పటికే శ్రీ రామ నవమి సందడి మొదలైంది. పందిళ్ళు రెడీ అవుతున్నాయి. దేవాలయాలు ముస్తాబవుతున్నాయి. సీతారాముల కల్యాణం చూడడానికి భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజున చలిమి పానకం ప్రసాదంగా భక్తులకు పంపిణీ చేస్తారు.

ఇంకా చదవండి

శ్రీరామ నవమి వేడుకల్లో నీతా అంబానీ.. రామాయణ ఘట్టాలతో మెరిసిన ప్రత్యేక చీర!

రిలయన్స్ ఫౌండేషన్ అధ్యక్షురాలు నీతా అంబానీ తన విలక్షణమైన ఫ్యాషన్ సెన్స్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా శ్రీరామ నవమి సందర్భంగా ఆమె ధరించిన ఒక ప్రత్యేకమైన చీర ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఎంపిక చేసుకున్న ఈ వస్త్రం భక్తిని, మన దేశ గొప్ప వారసత్వాన్ని ప్రతిబింబిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫోటోలు ఫ్యాషన్ ప్రియులనే కాకుండా, ఆధ్యాత్మిక భావాలు ఉన్నవారిని కూడా మంత్రముగ్ధులను చేస్తున్నాయి.

Rama Navami: అబ్బ.. అద్భుత దృశ్యం.. దర్గాలో రాములోరి కల్యాణం.. ఫలహారం తిన్న ఉడుత.. వీడియో ఇదిగో..

శ్రీరామనవమి వేడుకలు దేశవ్యాప్తంగా కన్నుల పండవగా జరిగాయి. సీతారాముల కల్యాణంతో ఊరూవాడా సందడిగా మారాయి. శోభాయాత్రలతో నగరాలు, పట్టణాల్లో ఆధ్యాత్మిక వాతావరణం కనిపించింది. కాగా.. శ్రీరామనవమి వేడుక సందర్భంగా అద్భుత దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించిపోయారు. రాములోరి కోసం నైవేథ్యంగా పెట్టిన ఫలహారాలను ఉడుత భుజించడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

Mahesh Babu: ఆంధ్రప్రదేశ్‌లో హీరో మహేష్ బాబు పోలికలతో రాముడి విగ్రహం.. ఫొటోస్ వైరల్

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఓ గుడిలో ఉన్న శ్రీరాముడి విగ్రహం ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఎందుకంటే ఈ రాములోరి విగ్రహం అచ్చం హీరో మహేశ్‌ బాబులాగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ దేవాలయంలో ఆ రాముడి విగ్రహం ఉందని ఓ నెటిజన్‌ పోస్ట్‌ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.

PM Modi: అయోధ్యలో అద్భుత దృశ్యం.. రామ్ లల్లాకు సూర్యతిలకం.. ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధాని మోదీ

పవిత్రమైన రామ నవమి పర్వదినం రోజున, నలుమూలల నుండి అయోధ్యలోని రామనగరికి విచ్చేసిన భక్తులు ఒక అసాధారణమైన క్షణానికి సాక్ష్యమిచ్చారు. శుక్రవారం (మార్చి 27) సరిగ్గా 12 గంటలకు, అయోధ్యలోని అద్భుతం చోటు చేసుకుంది. రామ్ లల్లాకు సూర్య తిలకం దిద్దారు. సూర్యకిరణాలు రామ్ లల్లా నుదుటిపై పడగానే, ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది.

కాసేపట్లో భద్రాద్రిలో సీతారాముల కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్ దంపతులు

దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో కాసేపట్లో లోకకల్యాణానికి సర్వం సిద్ధమైంది. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి. సీతారాముల కల్యాణానికి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా.. భక్తకోటి మురిసేలా ఘనంగా ఏర్పాట్లు చేశారు. రాములోరి కల్యాణఘట్టాన్ని ప్రత్యక్షంగా కన్నులారా వీక్షించి తరించేందుకు భక్తకోటి పెద్దఎత్తున తరలివస్తుంది.

రాములోరి వేడుక ఏదైనా ఇక్కడి నుంచే కొబ్బరి బోండాలు వెళ్లాల్సిందే.. అంత ప్రత్యేకత ఏటంటే?

భద్రాద్రి రాములోరి కల్యాణానికైనా.. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకైనా కోనసీమ నుంచి కొబ్బరి బోండాలు వెళ్లాల్సిందే..! శంఖు చక్రాలు, తిరునామాలు, సీతారాములవారి పేర్లను ప్రత్యేకంగా కొబ్బరిబోండాలపై తీర్చీదిద్ది రాములోరి కల్యాణానికి పంపించడం 26 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తోంది. కోనసీమ జిల్లా మండపేటకు చెందిన రామారెడ్డి, మహాలక్ష్మి దంపతులు గత రెండు దశాబ్దాలకు పైగా తమభక్తిని చాటుకుంటున్నారు.

Sri Rama Navami Special: సీతారాముల పవిత్ర కళ్యాణం గురించి మీకు తెలియని నిజం!

Sita Rama Kalyanam Story: శ్రీరాముడు మానవ రూపంలో అత్యంత పరిపూర్ణమైన అవతారంగా భగవంతుని రూపంలో జన్మించి, సాధారణ మానవ జీవితం అనుభవించి, కష్టాలను ఎదుర్కొని రాక్షస రాజు రావణాసురుని సంహరించారు. తన రాజ్యాధికార ముగిసిన తర్వాత సరయు నదిలో జలప్రవేశం చేసి అవతార పరిసమాప్తి పొందారు. చైత్ర శుద్ధ నవమి రోజు మాత్రమే ఆయన జన్మదినం కాక, సీతారాముల కల్యాణం కూడా జరుగుతుంది.

శ్రీరామ నవమి పూజ ఇలా చేయండి: ఈ ఒక్క సీక్రెట్ మిస్ అవ్వకూడదు!

Sri Rama Navami: శ్రీ రామ నవమిని 27వ తారీఖున జరుపుకోవాలి. సాధారణ పూజలతో పాటు, రామాయణ పారాయణం లేదా రామనామ జపం చేయవచ్చు. అయితే, రాముడిని నిజంగా పూజించడమంటే ఆయన ఆదర్శాలను, ధర్మాన్ని పాటించడం. మాట నిలబెట్టుకోవడం, బంధాలకు విలువ ఇవ్వడం వంటి రాముని గుణాలు అనుసరించడమే నిజమైన పూజ.

శ్రీరామ నవమి రోజున ఇంట్లో ఈ 5 వస్తువులు ఉంచితే అదృష్టం, సంపద, సుఖం రెట్టింపు!

Sri Rama Navami: మార్చి 27 శుక్రవారంనాడు శ్రీరామనవమి పండుగను దేశ వ్యాప్తంగా వైభవోపేతంగా జరుపుకుంటారు. అయితే, రామనవమి రోజున ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి, మీ కుటుంబానికి ఆనందం, శ్రేయస్సు కలుగుతుందని నమ్ముతారు. ఆ వస్తువుల గురించి తెలుసుకుందాం.

శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ స్నేహితులకు ఇలా పంపండి

Sri Rama Navami wishes for friends: ప్రతి పండుగకు మన ఫ్రెండ్స్ కు వాట్సప్ నుంచి విషెస్ తెలుపుతుంటాము. తెలుగు రాష్ట్ర ప్రజలు శ్రీరామనవమి పండుగను జరుపుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ మీ కోసం కొన్ని మెసేజ్ సందేశాలు ఉన్నాయి. మీరు, మీ ప్రియమైన స్నేహితులకు పంపి పండుగ విషెస్ చెప్పండి

Hyderabad: మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. వైన్స్, బార్లు బంద్.. ఎప్పటి వరకంటే..?

మందు బాబులకు సర్కార్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర రాజధాని జంటనగరాల్లో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా రేపు అంటే.. మార్చి 27వ తేదీన హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధి‌లోని వైన్స్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు బంద్ చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

రామయ్యకి ఎంతో నచ్చిన పానకం.. ఈ సారి ఇది ఒక్కటి వేయండి.. బాడీ నీట్‌గా ఆరోగ్యం ఫిట్‎గా

Sri Rama Navami 2026: శ్రీరామనవమి పండుగ రోజు ప్రసాదాల కంటే పానకం కోసమే గుడికి వెళ్తారు. ఎందుకంటే, ఇది తాగితే అనారోగ్య సమస్యలన్ని దెబ్బకు మాయం అవుతాయి. ఇలా చేసి తాగితే బాడీ నీట్‌గా ఆరోగ్యం ఫిట్‎గా .. ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..