- Telugu News Photo Gallery Cinema photos Anchor Lasya visits Tirumala Ayodhya Temple On Sri Rama Navami Festival , See Photos
Lasya Manjunath: శ్రీరామనవమి పర్వదినాన.. అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న యాంకర్ లాస్య.. ఫొటోస్ ఇదిగో
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం (ఏప్రిల్ 06) రామలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేక కార్యక్రమాలు, పూజల్లో రామ భక్తులు నిమగ్నమవుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ యాంకర్ లాస్య మంజునాథ్ శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యను దర్శించుకుంది. అక్కడి బాలరాముడికి ప్రత్యేక పూజలు చేసింది.
Updated on: Apr 07, 2025 | 1:26 PM

శ్రీరామనవి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు ఈ వేడుకల్లో భాగమవుతున్నారు. రాముడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని యాంకర్ లాస్య తన కుటుంబంతో కలిసి అయోధ్య నగరానికి వెళ్లింది

ఆదివారం ( ఏప్రిల్ 6) శ్రీరామనవమిని పురస్కరించుకుని బాల రాముడిని దర్శించుకుంది. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

'రాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఉన్నాం' అంటూ తన అయోధ్య పర్యటనకు సంబంధించిన ఫొటోలకు సోషల్ మీడియాలో షేర్ చేసింది లాస్య.

అలాగే అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపింది లాస్య. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

లాస్య, మంజునాథ లది ప్రేమ వివాహం. 2017లో వీరి పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం టీవీ షోలకు దూరంగా ఉంటోంది లాస్య.




