AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ప్రారంభం అయిన శ్రీరామనవమి శోభాయాత్ర .. లైవ్ వీక్షించండి

Hyderabad: ప్రారంభం అయిన శ్రీరామనవమి శోభాయాత్ర .. లైవ్ వీక్షించండి

Ram Naramaneni

| Edited By: TV9 Telugu

Updated on: Apr 07, 2025 | 1:31 PM

శోభాయాత్రకు వేలల్లో రామ భక్తులు హాజరయిన నేపథ్యంలో నగరంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 20 వేల మంది విధుల్లో ఉండి పర్యవేక్షిస్తున్నారు. జై శ్రీరామ్ నామాన్ని జపిస్తూ భక్తులు ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగమవుతున్నారు.

హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర ప్రారంభమైంది. మంగళ్‌హాట్‌ సీతారాంబాగ్ నుంచి సుల్తాన్‌బజార్ హనుమాన్‌ వ్యాయామశాల వరకు మూడున్నర కిలోమీటర్లు శోభాయాత్ర కొనసాగనుంది. ఈ శోభాయాత్రకు 20 వేల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసు ఉన్నతాధికారులు.

శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు. ఈ క్రమంలోనే.. భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్ పరిశీలించారు. భద్రతా చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. శోభాయాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు హైదరాబాద్‌ అడిషనల్‌ సీపీ విక్రమ్‌సింగ్‌ మాన్‌.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Published on: Apr 06, 2025 03:28 PM