Rama Navami 2025 Live: జగమంతా రామమయం.. భద్రాచలం సీతారాముల కల్యాణం.. లైవ్ వీడియో
సీతారామం.. భద్రాచలం.. దేవదేవుడి కల్యాణం.. చూతము రారండి అంటూ లక్షలాది భక్తులు దక్షిణ అయోధ్య బాట పట్టారు. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.. మిధిలా స్టేడియం వేదికగా.. రాములోరి కల్యాణ క్రతువును వేదమంత్రోచ్ఛరణల మధ్య నిర్వహించారు.
సీతారామం.. భద్రాచలం.. దేవదేవుడి కల్యాణం.. చూతము రారండి అంటూ లక్షలాది భక్తులు దక్షిణ అయోధ్య బాట పట్టారు. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.. మిధిలా స్టేడియం వేదికగా.. రాములోరి కల్యాణ క్రతువును వేదమంత్రోచ్ఛరణల మధ్య నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా భద్రాచలం చేరుకుని.. సీతారాములవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. రాములోరి కల్యాణం సందర్భంగా మిథిలా స్టేడియం భక్తులతో కిక్కిరిసింది..
సీఎం దంపతులతోపాటు.. పలువురు ప్రముఖులు సైతం రాములోరి కల్యాణానికి విచ్చేశారు. మంత్రి కొండా సురేఖ, సీఎస్ శాంతికుమారితో పాటు పలువరు సీనీ, రాజకీయ ప్రముఖులు భద్రాచలం వచ్చారు.
భక్తులతో మిథిలా స్టేడియం కిటకిటలాడింది. కల్యాణ మహోత్సవానికి వచ్చే భక్తుల కోసం మూడు లక్షల లడ్డూలను దేవస్థానం అధికారులు సిద్ధం చేశారు. వీటిని 28 కౌంటర్ల ద్వారా భక్తులకు విక్రయించనున్నారు. అలాగే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 1,800 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
రాములవారి పెళ్లి లోకానికే పండుగ అన్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథర్ రామానుజ జీయర్ స్వామిజీ. ప్రపంచశాంతి కోసం రామనామం జపించాలన్నారు.
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

