X ను అమ్మేసిన ఎలాన్ మస్క్ వీడియో
ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ‘X’ను విక్రయించినట్లు ప్రకటించారు. అయితే, అది బయటి వ్యక్తులకు కాదట. మస్క్ నేతృత్వంలోని ఏఐ స్టార్టప్ సంస్థ ‘xAI’కే విక్రయించారు. ఈ మేరకు మస్క్ ‘X’లో పోస్టు చేశారు. 33 బిలియన్ డాలర్లకు ఎక్స్‌ను అమ్మివేసినట్లు మస్క్ ప్రకటించారు. తాజాగా ఎక్స్‌ఏఐ విలువను 80 బిలియన్ డాలర్లుగా నిర్ధరించారు. ఎక్స్‌ఏఐ అధునాత ఏఐ సామర్థ్యాన్ని, ఎక్స్‌కు అనుసంధానించడం ద్వారా ఉత్తమ ఫలితాలు రాబట్టవచ్చని మస్క్ తన పోస్టులో వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మస్క్ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈవోగానూ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
2022లో ‘ట్విటర్’ను మస్క్ 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. అనంతరం దాని పేరును ‘ఎక్స్’గా మార్చేశారు. ఎక్స్‌ను సొంతం చేసుకున్న తర్వాత సిబ్బందిని తొలగించడం, ద్వేషపూరిత ప్రసంగాలు అప్పట్లో సంచలనం రేపాయి. చాట్‌జీపీటీకి పోటీగా గతేడాది మస్క్ ‘xAI’ పేరుతో స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. ‘‘ఎక్స్‌ఏఐ, ఎక్స్ భవిష్యత్‌లు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. డేటా మోడల్స్‌ను అనుసంధానం చేయడం ద్వారా మరిన్ని ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు ముందడుగు వేస్తున్నాం. ఎక్స్‌ఏఐ అధునాతన సామర్థ్యం ఎక్స్ పరిధిని మరింత పెంచుతుంది’’ అని మస్క్ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఈ రెండు సంస్థల కలయిక కోట్లాది మంది ప్రజలకు అత్యద్భుత అనుభూతిని అందిస్తుందని మస్క్ అన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
టేకాఫ్‌కి సిద్ధంగా ఉన్న విమానంలో పొగలు.. వీడియో
టీ, కాఫీ తాగితే నిజంగానే తల నొప్పి తగ్గుతుందా?
తప్పిపోయిన బాలికను పట్టించిన డ్రోన్ కెమెరా వీడియో
ఖతర్నాక్ దొంగలు.. రూ.100 చూపించి.. రూ.1.50 లక్షలు కొట్టేశారు వీడియో

జ్యోతిష్యం చెబుతుండగా తుర్రుమన్న చిలక.. ఆ తర్వాత

ప్రమాదంలో గాయపడిన కొండముచ్చు.. స్థానికులు ఏం చేశారంటే

ఆకలి మీదున్న పాము.. తేలును ఎలా మింగేసిందో చూడండి.. బాబోయ్

పదిహేను అడుగుల కింగ్ కోబ్రాల సయ్యాట..

రాములోరి గుడి సమీపాన అదో మాదిరి ఆకారం.. వెళ్లి చూడగా..

భార్య తల నరికి సైకిల్ బుట్టలో పెట్టుకున్న భర్త.. తర్వాత వీడియో

సైకిల్ పై గడ్డిమోపుతో ట్రంప్.. వీడియో వైరల్
