అమెరికాను వదిలి వెళ్లిపోండి.. ఆ విదేశీ విద్యార్థులకు వార్నింగ్..వీడియో
స్వచ్ఛందంగా తమ దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని విదేశీ విద్యార్ధులకు అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు పలువురు విద్యార్ధులకు ఈ మెయిల్స్ పంపినట్టు సమాచారం. క్యాంపస్ ఆందోళనల్లో క్రియాశీలంగా వ్యవహరించిన అమెరికాలోని విదేశీ విద్యార్థులకు ఈ హెచ్చరికలు జారీ చేసింది.
కేవలం ఆందోళనల్లో పాల్గొన్నవారికే కాకుండా అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన విద్యార్థులకు కూడా హెచ్చరిక సందేశాలు పంపినట్లు తెలుస్తోంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో అమెరికాలోని భారతీయ విద్యార్థులు, భారతదేశంలోని వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్ణయం అమెరికాలోని విదేశీ విద్యార్థుల భావ ప్రకటనా స్వేచ్ఛపై పరిమితులు విధిస్తుందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతి వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతున్న వారి సోషల్ మీడియా ఖాతాలను అమెరికా విదేశాంగశాఖ జల్లెడ పడుతోంది. ఒకవేళ అదే నిజమని తేలితే ఆ విద్యార్థులకు అమెరికాలో చదువుకునే వీల్లేకుండా తక్షణమే స్వదేశానికి పంపించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు అమెరికా విదేశాంగశాఖ, కాన్సులేట్ అధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలను వెలువరించింది.
మరిన్ని వీడియోల కోసం :
టేకాఫ్‌కి సిద్ధంగా ఉన్న విమానంలో పొగలు.. వీడియో
టీ, కాఫీ తాగితే నిజంగానే తల నొప్పి తగ్గుతుందా?
తప్పిపోయిన బాలికను పట్టించిన డ్రోన్ కెమెరా వీడియో
ఖతర్నాక్ దొంగలు.. రూ.100 చూపించి.. రూ.1.50 లక్షలు కొట్టేశారు వీడియో
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు
వాహనాదారులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి టోల్ ఫ్రీ
