టీ, కాఫీ తాగితే నిజంగానే తల నొప్పి తగ్గుతుందా?
తలనొప్పి ఎప్పుడైనా రావచ్చు. ఒక్కోసారి ఆకస్మాత్తుగా వచ్చే తలనొప్పి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. నొప్పి తీవ్రతను భరించలేని వారు కొందరు మందులను ఆశ్రయిస్తారు. మరికొంతమంది వేడివేడి టీ లేదా కాఫీ తాగుతారు. అయితే కాఫీ, టీలు నిజంగా తలనొప్పిని తగ్గిస్తుందా? ఇందులో నిజమెంత? అసలు డాక్టర్లు ఏమంటున్నారు?టీ లేదా కాఫీ నిజంగా తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుందా? లేక నొప్పిని మరింత పెంచుతుందా అనే అంశంపై పోషకాహార నిపుణులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. టీ లేదా కాఫీలోని కెఫిన్ రక్త నాళాలను సంకోచించడం ద్వారా తాత్కాలిక నొప్పి నివారణ కలిగిస్తుంది. కానీ దీర్ఘకాలంలో మాత్రం ఇది తలనొప్పిని మరింత పెంచుతుందని అంటున్నారు.
ఒత్తిడి, ఆందోళన, డీహైడ్రేషన్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు తలనొప్పికి ప్రధాన కారణాలు. ఇందులో చాలా వరకు తలనొప్పి డీహైడ్రేషన్ వల్ల వస్తుంది. టీ లేదా కాఫీ తాగడం వల్ల శరీరంలో నీటి శాతం మరింత తగ్గుతుంది. వాటిలో ఉండే కెఫిన్ డీహైడ్రేషన్‌ను పెంచుతుంది. అందుకే టీ లేదా కాఫీ తాగడం వల్ల తక్షణ శక్తి, ఉపశమనం లభించినా తలనొప్పి మళ్లీ వస్తుందని అంటున్నారు. తలనొప్పిని నివారించడానికి టీ లేదా కాఫీని ప్రత్యామ్నాయంగా తీసుకునే బదులు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పుష్కలంగా నీరు తాగడం లేదా నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం మంచిదని అంటున్నారు. అల్లం టీ, గ్రీన్ టీ లేదా జ్యూసులు తాగడం కూడా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఒక చిన్న డార్క్ చాక్లెట్ ముక్క తీసుకున్నా కూడా తలనొప్పి లక్షణాల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. కానీ నొప్పి భరించలేనంతగా ఉంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
పాక్ జైలులో భారత మత్స్యకారుడు ఆ*త్మ*హత్య వీడియో
అమెజాన్‌కు బిఐఎస్ షాక్.. వేర్‌హౌస్‌పై దాడులు వీడియో
ఆయుష్షు ఉన్నంత వరకే.. బిష్ణోయ్ హత్య బెదిరింపులపై సల్మాన్ వీడియో