వాట్సప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. వీడియో
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందించడంలో ముందుంటుంది. తాజాగా వాట్సాప్ మాతృ సంస్థ మెటా మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ యూజర్లు తమ స్టేటస్‌కు మ్యూజిక్‌ను యాడ్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఇన్‌స్టాగ్రామ్‌లాగే ఇకపై వాట్సప్ స్టేటస్ ఫొటోలు, వీడియోలకు మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. అయితే, ఇందులో సెలెక్టెడ్ ట్రాక్స్ మాత్రమే వాడుకునే వెసులుబాటు కల్పించింది.
ఇష్టమైన పాటలను యాడ్ చేయడానికి వీలుపడదు. వాట్సాప్ స్టేటస్‌లో మ్యూజిక్ యాడ్ చేయడం ఎలాగంటే..ముందుగా వాట్సాప్ ఒపెన్ చేసి, యాడ్ స్టేటస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత గ్యాలరీ నుంచి… లేదా ఫొటో దిగి.. దాన్ని సెలక్ట్ చేసుకోవాలి. క్రాప్, స్టిక్కర్స్, ఎడిట్ ఆప్షన్లు సాధారణంగా స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటి ముందే మ్యూజిక్ ఐకాన్ కనిపిస్తుంది. ఆ మ్యూజిక్ ఐకాన్ మీద ట్యాప్ చేసి… మ్యూజిక్ లైబ్రరీని ఓపెన్ చేసుకోవాలి. అందులోని లిస్ట్ నుంచి నచ్చిన పాట సెలక్ట్ చేసుకోచ్చు. అయితే, ఫొటోకు 15 సెకన్ల వరకు మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. అదే వీడియోకైతే 60 సెకన్ల వరకు పాట ప్లే అవుతుంది. అంతేగాక యూజర్లు ఎంచుకున్న ట్రాక్ ఎక్కడి నుంచి ప్లే కావాలని కోరుకుంటున్నారో అక్కడి నుంచి అడ్జెస్ట్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు.
మరిన్ని వీడియోల కోసం :
పాక్ జైలులో భారత మత్స్యకారుడు ఆ*త్మ*హత్య వీడియో
అమెజాన్‌కు బిఐఎస్ షాక్.. వేర్‌హౌస్‌పై దాడులు వీడియో
ఆయుష్షు ఉన్నంత వరకే.. బిష్ణోయ్ హత్య బెదిరింపులపై సల్మాన్ వీడియో
చేయని నేరానికి 55 ఏళ్లు జైలు రూ.1200 కోట్లు పరిహారం వీడియో

వాటర్ కోసం ఫ్రిజ్ ఓపెన్ చేయగా.. లోపల సీన్ చూసి గుండె గుబేల్..

పామును బంధించేందుకు ప్రయత్నించిన స్నేక్ క్యాచర్‌కు ఝలక్..

వీర భక్తుడు అనుకునేరు.. అసలు విషయం వేరే..

ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో

జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్‌లో దారుణం.. వీడియో

గలీజుగా న్యూయార్క్ సబ్వే.? వీడియో

వాహనాలకు హారన్‌గా ఫ్లూట్, తబలా సంగీతం! వీడియో
