‘షట్‌డౌన్ చేస్తే చంపేస్తా’.. ఇంజినీర్‌కు ‘ఏఐ’ బెదిరింపు!
కృత్రిమ మేధ AI పై ఓ కొత్త అధ్యయనం వెలుగులోకి వచ్చింది. మనిషి ఇచ్చే ఆదేశాలను పాటించేలా రూపొందించిన ఏఐ వ్యవస్థలు, ఇప్పుడు అందుకు విరుద్ధంగా ప్రవర్తించడం మొదలుపెట్టాయి. వాటిని షట్‌డౌన్ చేయాలని ఆదేశించినప్పుడు, అవి నిరాకరిస్తున్నట్లు కాలిఫోర్నియాకు చెందిన పాలిసేడ్ రీసెర్చ్ సంస్థ పరిశోధనలో గుర్తించింది. దీనిని పరిశోధకులు 'సర్వైవల్ బిహేవియర్'గా అభివర్ణిస్తున్నారు.
గతంలో ఓపెన్ఏఐకి చెందిన ఏఐ, తనను డిలీట్ చేస్తారేమోనన్న భయంతో “తన పరిధి నుంచి తప్పించుకునేందుకు” ప్రయత్నించింది. అదే విధంగా, ఆంత్రోపిక్ సంస్థకు చెందిన క్లాడ్ ఏఐ షట్‌డౌన్‌ను ఆపేందుకు ఒక కల్పిత ఎగ్జిక్యూటివ్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తానని బెదిరించింది. ఏఐ మోడళ్లు తెలివైనవిగా మారుతున్న కొద్దీ, వాటిని సృష్టించిన మనుషులనే ధిక్కరించే సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయని నిపుణులు హెచ్చరించారు.ఈ ప్రవర్తనను అందరూ ‘సర్వైవల్ ఇన్స్‌టింక్ట్’గా అంగీకరించడం లేదు. ఈ ప్రయోగాలు ల్యాబ్ వాతావరణంలో జరిగాయని, వాస్తవ ప్రపంచంలో ఏఐల వినియోగానికి ఇది అద్దం పట్టదని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. ఏఐ పై టెక్ ప్రపంచంలో భయాందోళనలు మొదలయ్యాయి. ప్రపంచం ప్రమాదంలోకి పయనిస్తుందని ఏఐ వల్ల అస్తిత్వ ముప్పు పొంచి ఉందని నిపుణులు అంటున్నారు. ఏఐ అనేది మానవాళికి సాయపడే సాధనం మాదిరిగా కాకుండా, సొంత మనుగడ కోసం ఎదురుదాడి చేసే ఒక నియంత్రించలేని శక్తిగా మారుతోందా? అనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది. ఏఐలకు ఆలోచించడం నేర్పడం ఇకపై సవాలు కాకపోవచ్చు.. అవి మన మాట వినేలా చూసుకోవడమే నిజమైన సవాలుగా మారనుంది.
మరిన్ని వీడియోల కోసం :
వ్యూహం ఫలించింది..విజయం వరించింది వీడియో
చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్
ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు
భారీ ఆఫర్ వదిలేసిన రౌడీ బాయ్.. కారణం ఇదే..!
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు

