Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెజాన్‌కు బిఐఎస్ షాక్.. వేర్‌హౌస్‌పై దాడులు వీడియో

అమెజాన్‌కు బిఐఎస్ షాక్.. వేర్‌హౌస్‌పై దాడులు వీడియో

Samatha J

|

Updated on: Apr 02, 2025 | 4:40 PM

ప్రముఖ ఈ - కామర్స్ సంస్థ అమెజాన్ కు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిగ్ షాక్ ఇచ్చింది. శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్ట్ సిటీలో ఉన్న అమెజాన్ గోదాంపై సోదాలు నిర్వహించింది బిఐఎస్. 2016 చట్టం నిబంధనలను ఉల్లంఘించినందుకు హైదరాబాద్ శాఖ అధికారులు సోదాలు, సీజ్ ఆపరేషన్ నిర్వహించారు.

బీఐఎస్ జరిపిన సోదాల్లో స్మార్ట్ వాచీలు, ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లు, CCTV కెమెరాలు, వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు, మొబైల్ ఛార్జర్లు, ఎలక్ట్రిక్, నాన్-ఎలక్ట్రిక్ బొమ్మలతో సహా మొత్తం 2783 ఉత్పత్తులు BIS సర్టిఫికేషన్ లేకుండా స్టోర్ చేసి అమ్మకానికి ఉంచినట్లు గుర్తించారు. ఈ ఉత్పత్తులు భారత ప్రభుత్వం జారీ చేసిన నాణ్యత నియంత్రణ ఉత్తర్వుల QCOల పరిధిలోకి వస్తాయి. BIS స్టాండర్డ్ మార్క్ లేకుండా విక్రయిస్తున్న ఉత్పత్తులను అధికారులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న ఉత్పత్తుల విలువ రూ. 50 లక్షలకు పైగా ఉంటుందని అంచనా.

మరిన్ని వీడియోల కోసం :

గాల్లో ఢీకొన్న యుద్ధ విమానాలు.. వీడియోలు వైరల్‌

కింగ్ కోబ్రాతో ఇదేమి సయ్యాట సామి.. వీడియో

రామ్‌ చరణ్‌ బర్త్‌డే స్పెషల్‌ వచ్చేసింది.. RC 16 టైటిల్‌ ఇదే!

మా అణ్వాయుధాలు ఇవిగో.. ట్రంప్‌ను రెచ్చగొడుతూ ఇరాన్‌ వీడియో