మా అణ్వాయుధాలు ఇవిగో.. ట్రంప్‌ను రెచ్చగొడుతూ ఇరాన్ వీడియో
ఇరాన్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను రెచ్చగొట్టింది. అమెరికాతో ఎట్టి పరిస్థితుల్లో అణు ఒప్పందం చేసుకోబోమని పరోక్షంగా ట్రంప్‌కు సంకేతాలిచ్చింది. 85 సెకన్ల నిడివిగల వీడియో విడుదల చేసింది. ఇటీవల ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్‌కు లేఖ రాశారు. ఇరాన్‌తో అణు ఒప్పందం చేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఇరాన్‌ను చర్చలకు ఆహ్వానించారు. అందుకు సుమారు రెండు నెలల డెడ్‌లైన్ విధించారు. ఆ లేఖపై మసౌద్ స్పందిస్తూ ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా లేమని, ఆయనకు ఇష్టమొచ్చింది చేసుకోవచ్చు అన్నారు.
ట్రంప్ విధించిన అణు ఒప్పందం డెడ్ లైన్ గడువు సమీపిస్తున్న తరుణంలో తమ సైనిక విభాగం బలంగా ఉందని చెబుతూ ఇరాన్ 85 సెకన్ల వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో మిస్సైల్ సిటీ పేరుతో తన మూడవ అండర్‌గ్రౌండ్ క్షిపణులను ఏర్పాటు చేసిన ప్రదేశాల్ని క్యాప్చర్ చేసింది. అండర్‌గ్రౌండ్ టన్నెల్స్‌లో ఏర్పాటు చేసిన మిస్సైల్ సిటీలో భారీ అణ్వాయుధాలున్నాయి. ఇరాన్ మీడియా ప్రసారం చేసిన 85 సెకన్ల వీడియోలో ఇరాన్ సైనిక సారథి మేజర్ జనరల్ బాగెరీ, ఐఆర్‌సీజీ ఏరోస్పేస్ ఫోర్స్ చీఫ్ హాజిజాదెహో ఓపెన్ టాప్ జీపులో ప్రయాణిస్తూ క్షిపణుల్ని చూపిస్తున్నారు. ఇరాన్ మిస్సైల్ సిటీలో క్రూయిజ్ మిసైల్స్ ఉన్నాయి. ఈ అణ్వాయుధాల్ని ఇరాన్ ఇటీవల ఇజ్రాయిల్‌పై దాడి చేసేందుకు ఉపయోగించినట్లు పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.
మరిన్ని వీడియోల కోసం :
రమాప్రభకు రాజేంద్ర ప్రసాద్ ఏమవుతాడో తెలుసా?
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌తో పీకల్లోతు ప్రేమలో కావ్యా మారన్ .. క్లారిటీ..
అల్లు అర్జున్ ప్లానింగ్‌కు.. మైండ్ బ్లాక్ అవుతుందిగా..!వీడియో