చైనా నుంచి భారత్‌కు విమాన సర్వీసులు..ఐదేళ్ల తర్వాత రీస్టార్ట్ వీడియో
భారత్, చైనా మధ్య ఐదేళ్ల తర్వాత నేరుగా విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించాలని ఆలోచిస్తున్న చైనా కాన్సుల్ జనరల్ జు వీ తెలిపారు. ఈ విషయంపై భారత అధికారులతో చర్చలు జరుపుతున్నామని ఆయన చెప్పారు. కొవిడ్, గల్వాన్ ఘర్షణల తర్వాత భారత్, చైనా మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అందుకే ఇప్పుడు విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నట్లు జనరల్ అన్నారు. కోల్‌కతాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.
కొవిడ్‌కు ముందు బీజింగ్, షాంఘై, గ్వాంగ్‌జౌ, కున్మింగ్ నుంచి భారత్‌లోని ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, ఇతర నగరాలకు వారానికి 50 విమాన సర్వీసులుండేవని చెప్పారు. ఆ సేవలను తిరిగి పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.విమాన సర్వీసుల పునరుద్ధరణ తర్వాత వీసా నిబంధనల్లో కూడా సడలింపులు చేసే అవకాశం ఉన్నట్లు చైనా కాన్సుల్ జనరల్ అన్నారు. భారత్, చైనా మధ్య దౌత్య సంబంధాలకు మరో వారంలో 75 ఏళ్లు పూర్తవుతుండడం వల్ల ఏప్రిల్ 1న ఇరుదేశాలు సంయుక్తంగా కొన్ని వేడుకలను జరుపుకోనున్నట్లు తెలిపారు. భారత్‌తో కలిసి వేడుకలను జరుపుకోవడానికి, దౌత్య సంబంధాలను మరింత మెరుగుపరుచుకోవడానికి ఉత్సాహంగా ఉన్నామని అన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
రమాప్రభకు రాజేంద్ర ప్రసాద్ ఏమవుతాడో తెలుసా?
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌తో పీకల్లోతు ప్రేమలో కావ్యా మారన్ .. క్లారిటీ..
అల్లు అర్జున్ ప్లానింగ్‌కు.. మైండ్ బ్లాక్ అవుతుందిగా..!వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్‌కు ఫిదా నెటిజన్లు
ఆ రంగంలో మహిళలకే ఎక్కువ జీతాలు
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.

