అల్లు అర్జున్ ప్లానింగ్‌కు.. మైండ్ బ్లాక్ అవుతుందిగా..!వీడియో
అలా వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత.. దాన్ని మించేలా పుష్పతో రికార్డులతో చెడుగుడు ఆడుకున్నారు బన్నీ. పుష్పకు సీక్వెల్‌గా వచ్చిన పుష్ప2తో.. ఏకంగా 1800 కోట్లు వసూలు చేసి.. తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు.ఇక ఇంత పెద్ద హిట్ వచ్చింది కాబట్టే.. కెరీర్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు బన్నీ. పుష్ప 2 తర్వాత ఎంత పెద్ద కమర్షియల్ సినిమా చేసినా.. ఆడియన్స్‌కు అది ఎక్కడం కష్టమే. అందుకే ఈసారి రూట్ మారుస్తున్నారు బన్నీ.
అట్లీతో చేయబోయే సినిమా జోనర్ ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు రాలేదని తెలుస్తుంది. ప్యారలల్ వరల్డ్ కాన్సెప్ట్‌తో యాక్షన్ జోనర్‌లో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు ఈ దర్శకుడు. సమ్మర్ తర్వాత రెగ్యులర్ షూట్ మొదలు కానుంది.ఇక అట్లీ సినిమాతో కొత్త జోనర్ ట్రై చేస్తున్న బన్నీ.. త్రివిక్రమ్ కోసం మరో జోనర్‌లోకి వెళ్లనున్నారు. ఇప్పటి వరకు కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా మైథలాజికల్ సినిమా చేయబోతున్నారు బన్నీ, గురూజీ.ఈ కాంబో అంటే ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. కానీ ఈసారి ఇంకాస్త భారీగా ప్లాన్ చేస్తున్నారు ఈ కాంబో. అట్లీ సినిమా బడ్జెట్ 500 కోట్లకు పైనే ఉండబోతుంది. విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అయితే మైథలాజికల్ జోనర్‌లో నెవర్ బిఫోర్ అన్నట్లు ఉండబోతుంది. తను చేయబోయే నెక్ట్స్ రెండు సినిమాలు డిఫెరెంట్ జోనర్స్ ట్రై చేస్తూ.. కమర్షియల్‌గానూ సక్సెస్ అయ్యేలా డిజైన్ చేసుకుంటున్నారు అల్లు వారబ్బాయి.
మరిన్ని వీడియోలు :
స్టార్ హీరోలకు దిమ్మతిరిగే షాక్.. ఇప్పుడు ‘ఎంపురాన్’ సినిమా పరిస్థితి దారుణం
వందల కోట్ల ఆశ చూపించి.. గ్రామస్తులను మోసం చేసిన నటుడు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

