స్టార్ హీరోలకు దిమ్మతిరిగే షాక్.. ఇప్పుడు ‘ఎంపురాన్’ సినిమా పరిస్థితి దారుణం
మలయాళీ స్టార్ హీరోస్ మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ L2 : ఎంపురాన్. మార్చి 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా HD ప్రింట్ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టడం చూసి అభిమానులు, సినీప్రియులు షాకయ్యారు. ఈ ప్రింట్ సినిమా థియేటర్ నుంచి కాపీ చేయలేదనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ప్రస్తుతం థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటున్న ఈ సినిమా మలయాళం, హిందీ, తమిళ వెర్షన్లు ఆన్‌లైన్‌లో ప్రసారం అవుతున్నాయి. విడుదలైన కొన్ని గంటల్లోనే ప్రింట్లు.. టెలిగ్రామ్, ఇతర ప్లాట్‌ఫామ్‌లలోకి వచ్చాయి. ఓ సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్ల నుంచి లీకయ్యే ప్రింట్ సరైన క్వాలిటీలో ఉండదు. కానీ.. ఎంపురాన్ మాత్రం 1080 పిక్సెల్ ఫుల్ HD ఫార్మాట్‌లో ఉంది. దీంతో ఇది థియేటర్ నుంచి లీక్ అయ్యే అవకాశం లేదని సైబర్ నిపుణులు అంటున్నారు. ఈ సినిమాతో సంబంధం ఉన్న వారి నుండే లీక్ అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని, కంప్లయింట్ వస్తే దర్యాప్తు ప్రారంభిస్తామని కొచ్చి సైబర్ పోలీసులు ప్రకటించారు. ఇక నకిలీ వెర్షన్లను వ్యాప్తి చేసే వారిని కనుగొనడానికి ప్రొఫెషనల్ ఎథికల్ హ్యాకర్లను నియమించినట్లు కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం :
కాపీ పేస్ట్ కాదు..లెక్క వేరిక్కడ!
మ్యాడ్ స్క్వేర్ అందరినీ నవ్వించిందా.. మూవీపై రెస్పాన్స్ ఇదే?
విక్రమ్ వీర ధీర శూర..ఈ మూవీ హిట్టా? ఫట్టా?
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
