విక్రమ్ వీర ధీర శూర..ఈ మూవీ హిట్టా? ఫట్టా?
చియాన్ విక్రమ్, దుషారా విజయన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ వీర ధీర శూర. ఎస్.యు.అరుణ్ కుమార్ డైరెక్ట్ చేశాడు. థియేటర్స్ ఇష్యూ కారణంగా కాస్త ఆలస్యంగా తెలుగు టూ స్టేట్స్‌లో రిలీజ్ అయింది ఈ సినిమా.. ! మరి ఈ సినిమా ఎలా ఉంది. చియాన్ విక్రమ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడా లేదా అనేది ఈ పూర్తి రివ్యూలో చూసేద్దాం..!ఓ కిరాణా కొట్టు నడుపుకునే కాళి అలియాస్ చియాన్ విక్రమ్ తన భార్య వాణి అలియాస్ దుషారా విజయన్తో సాఫీగా జీవితం సాగిస్తుంటాడు. అయితే, అతను గతంలో పనిచేసిన పెద్దాయన అలియాస్ రవి అలియాస్ పృథ్వీ రాజ్ ఓ రోజు తన కొడుకు కణ్ణా అలియాస్ సూరజ్ వెంజరమూడుని ఎస్పీ అరుణగిరి అలియాస్ ఎస్.జె.సూర్య నుంచి కాపాడాలంటూ ప్రాధేయపడుతాడు.
అసలు వీరితో కాళి ఎలాంటి గతాన్ని పంచుకున్నాడు..? ఐపిఎస్ అయిన ఎస్.జె.సూర్య పెద్దాయన కొడుకును ఎందుకు చంపాలని అనుకుంటాడు..? పెద్దాయన కోరికను కాళి తీరుస్తాడా..? అనేది సినిమా కథ.ఇలాంటి యాక్షన్ రివెంజ్ డ్రామాల్లో కథలో చిన్న పాయింట్ ఉంటే సినిమా మొత్తాన్ని ఆసక్తికరంగా మార్చవచ్చు. ఈ సినిమాలోనూ అలాంటి పాయింట్ ఒకటి ఉంటుంది. కానీ, ఆ పాయింట్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా పర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేసి ఉండాల్సింది. ఇక ఈ సినిమాలో కాళి పాత్రలో విక్రమ్ తన నుంచి మంచి స్కోప్ ఉన్న పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అటు ఎస్.జె.సూర్య పర్ఫార్మెన్స్‌తో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేశాడు.కథను ఎంగేజింగ్‌గా తీసుకెళ్లాలని దర్శకుడు పడిన తాపత్రయం మనకు సినిమా ప్రారంభంలోనే కనిపిస్తుంది. కథలోకి తీసుకెళ్లేందుకు అతడు ఎంచుకున్న విధానం కొంతమేర ఆకట్టుకుంటుంది. ఇక కథను నెరేట్ చేసిన విధానం కూడా పర్వాలేదనిపిస్తుంది.యాక్షన్ సీక్వెన్స్‌ల కంపోజిషన్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది. అటు హీరో ఎలివేషన్స్ కూడా కొంతమేర ఆకట్టుకుంటాయి. సంగీతం పరంగా బీజీఎం వర్క్ బాగుంది. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు కలిసొచ్చే అంశం అని చెప్పాలి.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

