వందల కోట్ల ఆశ చూపించి.. గ్రామస్తులను మోసం చేసిన నటుడు
హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రేయస్ తల్పాడే. పుష్ప 2 హిందీ వెర్షన్ లో అల్లు అర్జున్ పాత్రకు డబ్బింగ్ చెప్పాడు. సహజ నటనతో ప్రేక్షకులను అలరించిన ఈ నటుడు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. వందల కోట్ల రూపాయలను మోసం చేశాడని అతను ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే, ఇది సినిమా పరిశ్రమకు సంబంధించిన కుంభకోణం కాదు. ఏ నిర్మాతను శ్రేయస్ మోసం కూడా చేయలేదు. కానీ గ్రామస్తులను శ్రేయాస్ తల్పాడే చాలా తెలివిగా మోసం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. వందల కోట్ల కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రేయస్ తల్పడేపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉత్తర్ ప్రదేశ్ మహోబ జిల్లాలో ఓ సహకార సంఘం చిట్ ఫండ్ కంపెనీ పేరుతో గ్రామస్తులను నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిందట. తక్కువ సమయంలోనే డబ్బు రెట్టింపు చేస్తామని చెప్పడంతో జనం భారీగా డిపాజిట్లు చేశారు. చివరకు కంపెనీ చేతులెత్తేయడంతో స్థానికులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడేతో పాటు మరో 14 మందిపై కేసు నమోదు చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను శ్రేయాస్ తల్పాడే ఖండించారు. అవన్నీ నిరాధారమైనవని అన్నారు. ఇతర స్టార్స్ లాగే తనకు కూడా కొన్ని కార్యక్రమాలకు ఆహ్వానాలు వస్తాయని, వీలైనప్పుడు ఆ వేడుకలకు వెళ్తుంటానని చెప్పారు. సదరు కంపెనీ కార్యక్రమానికి కూడా అలాగే వెళ్లాను తప్ప ఆ సహకార సంఘానికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
కాపీ పేస్ట్ కాదు..లెక్క వేరిక్కడ!
మ్యాడ్ స్క్వేర్ అందరినీ నవ్వించిందా.. మూవీపై రెస్పాన్స్ ఇదే?
విక్రమ్ వీర ధీర శూర..ఈ మూవీ హిట్టా? ఫట్టా?