స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌తో పీకల్లోతు ప్రేమలో కావ్యా మారన్ .. క్లారిటీ..
క్రికెట్ అభిమానులకు కావ్యా మారన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐపీఎల్ సీజన్ లో ఆమె పేరు మారుమోగిపోతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ అయిన కావ్యా.. ఆ జట్టు ఆడే ప్రతి మ్యాచ్ కు హాజరవుతూ తన టీంకు ఉత్సాహపరుస్తుంటుంది. ఈ క్రమంలోనే క్రికెట్ చూస్తూ ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తన టీం గెలిస్తే చిన్నపిల్లలా మారిపోయి సంతోషంతో గంతులేస్తుంటుంది. ఇక జట్టు ఓడిపోతే మాత్రం బోరున ఏడ్చేస్తుంది. అందుకే నెట్టింట కావ్య ఫోటోస్, వీడియోస్ వైరలవుతుంటాయి.
ప్రస్తుతం ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ల సమయంలో కావ్య సైతం స్టేడియంలో సందడి చేసింది. తాజాగా కావ్య పర్సనల్ లైఫ్ గురించి ఓ న్యూస్ ఇప్పుడు ఆమె అభిమానులకు షాకిస్తుంది.తాజాగా ఆమె ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తో ప్రేమలో ఉందనే టాక్ వినిపిస్తుంది. అతడు మరెవరో కాదు.. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్. కోలీవుడ్ రిపోర్ట్ ప్రకారం.. అనిరుధ్, కావ్య ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈ రూమర్స్ పై అనిరుధ్ పర్సనల్ టీం స్పందిస్తూ.. ఆ వార్తలలో ఎలాంటి నిజం లేదన్నారు. కావ్య, అనిరుధ్ ఇద్దరూ మంచి స్నేహితులు అని చెప్పుకొచ్చారు.ఇక గతంలో అనిరుధ్ పేరు హీరోయిన్ కీర్తిసురేష్ తో వినిపించింది. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకుంటారంటూ టాక్ నడిచింది. కానీ ఇటీవలే కీర్తి తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని పెళ్లి చేసుకుంది. ఇక ఇప్పుడు అనిరుధ్ పేరు సన్ రైజర్స్ టీం యజమాని కావ్య మారన్ తో వినిపిస్తుంది.
మరిన్ని వీడియోలు :
స్టార్ హీరోలకు దిమ్మతిరిగే షాక్.. ఇప్పుడు ‘ఎంపురాన్’ సినిమా పరిస్థితి దారుణం
వందల కోట్ల ఆశ చూపించి.. గ్రామస్తులను మోసం చేసిన నటుడు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
