రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్ వచ్చేసింది.. RC 16 టైటిల్ ఇదే!
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజున బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. చెర్రీ అభిమానుల ఎదురు చూపులకు తెర దించుతూ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘RC16’ ఫస్ట్ లుక్ విడుదల చేసారు. చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి విషెస్ చెప్పింది. లాంగ్ హెయిర్.. గుబురు గడ్డంతో ఉన్న సరికొత్త లుక్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. అలాగే ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలిపింది.
స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా సిద్ధమవుతోందని టాక్. ఉప్పెన తర్వాత సుమారు రెండేళ్లపాటు కష్టపడి బుచ్చిబాబు దీనిని సిద్ధం చేశారు. ఇందులో రామ్‌చరణ్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండనున్నట్టు తెలుస్తోంది. జాన్వీకపూర్ కథానాయికగా, శివరాజ్‌కుమార్‌తోపాటు జగపతిబాబు కీలకపాత్రలో కనిపించనున్నారు. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ఇప్పటికే రెండు పాటలు పూర్తి చేశానని ఇటీవల రెహమాన్ చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
రమాప్రభకు రాజేంద్ర ప్రసాద్ ఏమవుతాడో తెలుసా?
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌తో పీకల్లోతు ప్రేమలో కావ్యా మారన్ .. క్లారిటీ..
అల్లు అర్జున్ ప్లానింగ్‌కు.. మైండ్ బ్లాక్ అవుతుందిగా..!వీడియో