గాల్లో ఢీకొన్న యుద్ధ విమానాలు.. వీడియోలు వైరల్
ఫ్యాన్స్‌లో రెండు యుద్ధ విమానలు ఢీకొన్నాయి. ఆకాశంలోకి ఎగరగానే ఒకదానికొకటి తాకి కింద పడ్డాయి. శిక్షణ సందర్భంగా విన్యాసాలు నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అయితే పైలట్లు పారాచూట్ల సహాయంతో దూకేశారు. గాయపడిన వారు స్పృహ తప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. రెండు ఫైటర్ జెట్లు ఆకాశంలో ఢీకొన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఫ్రాన్స్‌లోని సెయింట్ డైజియర్‌కు పశ్చిమ ప్రాంతంలోని ఎయిర్ బేస్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రేనియన్ పైలట్లకు ఫ్రాన్స్ శిక్షణ శిబిరం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మార్చి 25న ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఆల్ఫా జెట్ విమానాలతో ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ విన్యాసాల్లో ఆరు ఫైటర్ జెట్లు పాల్గొన్నాయి. గాలిలో విన్యాసాల సందర్భంగా రెండు జెట్ విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఢీకొన్న రెండు విమానాలు ఆల్ఫా జెట్ రకానికి చెందినవిగా అధికారులు గుర్తించారు.
మరిన్ని వీడియోల కోసం :
రమాప్రభకు రాజేంద్ర ప్రసాద్ ఏమవుతాడో తెలుసా?
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌తో పీకల్లోతు ప్రేమలో కావ్యా మారన్ .. క్లారిటీ..
అల్లు అర్జున్ ప్లానింగ్‌కు.. మైండ్ బ్లాక్ అవుతుందిగా..!వీడియో
అమీర్‌ఖాన్ కుమార్తెకు ఏమైంది?వీడియో
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం
సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్‌తో వంటనూనె తయారీ!
40 ఏళ్లుగా మ్యూజియంలో నక్కిన అతిపెద్ద పాము

