Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేయని నేరానికి 55 ఏళ్లు జైలు రూ.1200 కోట్లు పరిహారం వీడియో

చేయని నేరానికి 55 ఏళ్లు జైలు రూ.1200 కోట్లు పరిహారం వీడియో

Samatha J

|

Updated on: Apr 02, 2025 | 4:29 PM

అతడో ప్రొఫెషనల్ బాక్సర్. అయితే పదవి నుంచి విరమణ పొందిన తర్వాత ఓ చోట ఉద్యోగం చేశాడు. అక్కడే తన యజమాని కుటుంబం హత్యకు గురైతే.. ఇతడే చేశాడంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై న్యాయస్థానం కూడా అతడికి మరణశిక్ష విధించింది. కానీ ఆ తర్వాత కేసులో లభించిన కొన్ని ఆధారాలతో బాక్సర్‌కు సంబంధం లేదని మరణశిక్షను రద్దు చేసింది. కేసు విచారణను 5 దశాబ్దాలుగా కొనసాగిస్తోంది. కానీ బాక్సర్ మాత్రం జైల్లోనే ఉన్నాడు. దాదాపు 55 ఏళ్ల శిక్ష అనుభివించాక అతుడు నేరం చేయలేదని.. కోర్టు నిర్ధారించింది.

ఆపై ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ప్రస్తుతం 89 ఏళ్ల వయసున్న హకమాడా జపనీయుడు నిర్దోషి అని కోర్టు తేల్చింది. కేసును దర్యాప్తు చేయకుండానే పోలీసులు అతడే నిందితుడు అంటూ గతంలో కోర్టులో హాజరుపరిచారు. మృతుల వద్ద లభించిన రక్తపు మరకలు ఉన్న బట్టలను ప్రధాన సాక్ష్యంగా పరిగణించిన కోర్టు హకమాడాకు మరణ శిక్ష విధించింది. అయితే ఈ బట్టలను డీఎన్ఏ పరీక్షకు పంపగా వాటిని మృతదేహాల వద్ద పోలీసులే ఉంచినట్లు తెలిసింది. దీంతో న్యాయస్థానం హకమాడా మరణ శిక్షను రద్దు చేసింది. కేసును లోతుగా దర్యాప్తు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసంది. అలా అప్పటి నుంచి ఈ కేసు విచారణ సాగుతూనే వస్తోంది. తాజాగా కేసుతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని తెలిసింది.

మరిన్ని వీడియోల కోసం :

గాల్లో ఢీకొన్న యుద్ధ విమానాలు.. వీడియోలు వైరల్‌

కింగ్ కోబ్రాతో ఇదేమి సయ్యాట సామి.. వీడియో

రామ్‌ చరణ్‌ బర్త్‌డే స్పెషల్‌ వచ్చేసింది.. RC 16 టైటిల్‌ ఇదే!

మా అణ్వాయుధాలు ఇవిగో.. ట్రంప్‌ను రెచ్చగొడుతూ ఇరాన్‌ వీడియో