కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండలం గాంధీనగర్ తండా శివారులో చిరుత సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. పశువుల కొట్టంలో కట్టేసిన రెండు లేగదూడలపై చిరుత దాడి చేయడంతో అవి మృతిచెందాయి. చిరుతను బంధించేందుకు బోను ఏర్పాటు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఘటనా స్థలాన్ని ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు.