భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం లక్ష్మీపురం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. రేగళ్ల రేంజ్ నుంచి ఆళ్లపల్లి రేంజ్‌లోకి ప్రవేశించిన పులి అడుగుజాడలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ప్రజలు, రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా బయటకు రావొద్దని హెచ్చరించారు.