పాక్ జైలులో భారత మత్స్యకారుడు ఆ*త్మ*హత్య వీడియో
జైల్లో మగ్గిపోతున్న భారత్‌కు చెందిన ఓ మత్స్యకారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాత్‌రూమ్‌లో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఆ జైలు సూపరింటెండెంట్ ఈ విషయాన్ని తెలిపినట్లు మీడియా రాసుకొచ్చింది. భారత్- పాకిస్థాన్ జల సరిహద్దులపై సరిగా అవగాహన లేకుండా చేపల వేటకు వెళ్లి అక్కడి అధికారులకు చిక్కినవారు ఎంతోమంది ఉన్నారు. అదే విధంగా భారత్‌కు చెందిన మత్స్యకారుడు 52 ఏళ్ల గౌరవ్‌రామ్ ఆనంద్‌ను 2022లో అదుపులోకి తీసుకున్నారు.
అతడిని అరెస్టు చేసి కరాచీ జైల్లో ఉంచారు. నాటినుంచి అతడు అక్కడి కారాగారంలోనే మగ్గిపోతున్నాడు. అయితే.. మంగళవారం రాత్రి బాత్‌రూమ్‌లోకి వెళ్లిన మత్స్యకారుడు తాడుతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడు ఎంతసేపటికి బయటకి రాకపోవడంతో అనుమానించిన జైలు అధికారి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసేంతవరకు మృతదేహాన్ని కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచనున్నట్లు పాక్ అధికారులు తెలిపారు. కాగా.. గత నెలలో తమ కారాగారంలో ఉన్న 22 మంది మత్స్యకారులను పాక్ ప్రభుత్వం విడుదల చేసింది. వారి శిక్షాకాలం పూర్తికావడంతో కరాచీలోని మాలిర్ కారాగారం నుంచి విడుదల చేసింది.
మరిన్ని వీడియోల కోసం :
గాల్లో ఢీకొన్న యుద్ధ విమానాలు.. వీడియోలు వైరల్
కింగ్ కోబ్రాతో ఇదేమి సయ్యాట సామి.. వీడియో
రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్ వచ్చేసింది.. RC 16 టైటిల్ ఇదే!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

