అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్న లవినా శ్రీ, ప్రణీత్ ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లాలోని పద్మనాయక కళ్యాణ మండపంలో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. వధువు అమెరికాకు చెందిన అమ్మాయి కావడంతో బంధువులు ఈ పెళ్లిని ఆసక్తిగా తిలకించారు. ఇది అమెరికా అమ్మాయి, మంచిర్యాల అబ్బాయిల సుందరమైన ప్రేమగాథ.