AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసిన సీల్‌ వేసినట్లే ఉంటుంది..ఎలా కల్తీ చేస్తున్నారో చూసి పోలీసులే షాక్‌

వేసిన సీల్‌ వేసినట్లే ఉంటుంది..ఎలా కల్తీ చేస్తున్నారో చూసి పోలీసులే షాక్‌

Samatha J

|

Updated on: Apr 10, 2025 | 7:29 PM

కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠాను నల్గొండ టాస్క్‌‌ఫోర్స్‌‌ పోలీసులు పట్టుకున్నారు. స్పిరిట్‌‌తో మద్యాన్ని కల్తీ చేసి వైన్స్‌‌, బార్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. 600 లీటర్ల కల్తీమద్యం, 180లీటర్ల స్పిరిట్ స్వాధీనం చేసుకున్నారు. ఈజీ మని కోసం యువత అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందుకు స్థానిక సంస్థలను వినియోగించుకోవాలని ఓ ముఠా ప్లాన్ చేసింది. నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రానికి చెందిన జానీ పాషా ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్ళాడు

హైదరాబాద్‌లో బెంగళూరుకు చెందిన శ్రీనివాస్ గౌడ్ పరిచయమయ్యాడు. ఇద్దరూ కలిసి బెంగళూరు నుండి స్పిరిట్ తెప్పించి హైదరాబాద్ శివారులో కల్తీ మద్యం తయారు మొదలుపెట్టారు. గుట్టుచప్పుడు కాకుండా ఈ దందాను కొనసాగిస్తున్నారు.నిందితులు కల్తీ మద్యం తయారీకి బ్రాండెడ్‌‌ కంపెనీలను ఎంచుకుంటున్నారు. ముందు వైన్స్‌‌, బార్ల నుంచి బ్లెండర్స్‌‌ ప్రైడ్‌‌, టీచర్స్, బ్లాక్‌‌ లేబుల్‌‌, జానీవాకర్‌‌, బ్లాక్‌‌డాగ్‌‌ వంటి ఖరీదైన బాటిళ్లను సేకరిస్తున్నారు. వాటిల్లో కొంత మేర మద్యాన్ని తీసి ఆ ప్లేస్‌‌ను కర్ణాటక నుంచి తెప్పించిన ఆర్డినరీ లిక్కర్‌‌తో నింపేస్తున్నారు. కలర్‌‌లో తేడా రాకుండా వాటర్‌‌, స్పిరిట్‌‌ మిక్స్‌‌ చేస్తున్నారు. బాటిళ్లపై మూతలను తొలగించేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన ఎక్స్‌‌పర్ట్స్‌‌ను తీసుకొచ్చి పని చేస్తున్నారు. కంపెనీ నుంచి వచ్చిన సీల్‌ అలాగే ఉన్నా.. లోపల మందు మాత్రం కల్తీ అవుతోంది. ఇలా తయారు చేసిన నకిలీ మద్యాన్ని చండూరు, నాంపల్లి, మునుగోడు ప్రాంతాల్లోని వైన్స్‌‌, బెల్ట్‌‌షాపులకు సరఫరా చేస్తున్నట్లు తేలింది.

మరిన్ని వీడియోల కోసం 

గిన్నిస్‌ రికార్డులకెక్కిన ఎలుక..ఎందుకో తెలిస్తే షాకవుతారు వీడియో

శ్రీశైలంలో 2 చిరుతల సంచారం.. ఆ గేటు కాని లేకపోతే వీడియో

అయ్యో.. ఈ కండక్టర్‌ కష్టాలు ఎవరికీ రాకూడదు..వీడియో

క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయిన విద్యార్థి.. ఏం జరిగిందంటే వీడియో