క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయిన విద్యార్థి.. ఏం జరిగిందంటే వీడియో
గుండెపోటు మహమ్మారిలా మారింది. వయసుతో సంబంధం లేకుండా అందరిపైనా దాడి చేస్తోంది. క్షణాల్లో ప్రాణాలు తీసేస్తోంది. ఇటీవలే ఓ జంట 25వ పెళ్లిరోజు వేడుకల్లో దంపతులు డ్యాన్స్ చేస్తుండగా భర్త ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు... అతని వయసు యాభై ఏళ్లు.. ఇప్పుడు మిత్రులతో కలిసి క్రికెట్ ఆడుతున్న ఓ యువకుడ్ని మింగేసింది మాయదారి గుండెపోటు. ఈ విషాద ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఖమ్మం జిల్లాకు చెందిన వినయ్ అనే విద్యార్థి స్థానిక సీఎంఆర్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం కళాశాలలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లో తోటి విద్యార్థులతో కలిసి పాల్గొన్నాడు. ఈ క్రమంలో క్రికెట్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అలర్టయిన విద్యార్థులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే వినయ్ మృతిచెందినట్టు వైద్యులు నిర్దారించారు. కళ్ల ముందే తమ స్నేహితుడు మృతిచెందడంతో తోటి విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియో నెటిజన్లను కలచివేసింది.
మరిన్ని వీడియోల కోసం
ఊబకాయులకు గుడ్ న్యూస్.. మార్కెట్లోకి బరువు తగ్గించే ఇంజక్షన్?
తోపులే జడుసుకున్నారు.. ఈ క్రూజ్ టూర్‌కి గుండె ధైర్యం ఉందా?వీడియో
పెళ్లి పీటలెక్కాల్సి ఉండగా.. మృత్యుఒడికి.. వీడియో
బెడ్‌రూమ్‌లో ఉండాల్సిన మంచం రోడ్డుపైకి వస్తే.. వీడియో
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

