ఊబకాయులకు గుడ్ న్యూస్.. మార్కెట్లోకి బరువు తగ్గించే ఇంజక్షన్?
హైట్‌కు తగ్గ వెయిట్ ఉండాలంటారు డాక్టర్లు. కానీ మారిన జీవనశైలి కారణంగా అధిక బరువు అనేది కామన్‌గా మారింది. అధిక బరువు అనేది ప్రమాదకరమే. దాని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే బరువు తగ్గించుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. డైట్ మెయింటైన్‌తో పాటు మార్కెట్‌లో దొరికే మందులను విచ్చల విడిగా వాడుతుంటారు. ఇలా చేస్తే మంచిదేనా? ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదా? బరువు తగ్గడానికి వ్యాయామాలు చేయడం మంచిదని సలహాలు ఇస్తుంటారు డాక్టర్లు.
దానికోసం పలు రకాల ఎక్సర్‌సైజ్‌లు చేస్తారు. ఒకటి రెండు రోజులు చేయగానే బద్దకంతోనో, పని ఒత్తిడితోనో మధ్యలోనే మానేస్తుంటారు. ఈ క్రమంలో తేలిగ్గా బరువు తగ్గించే డ్రగ్స్ కంపెనీల ప్రకటనలు ఆకట్టుకుంటాయి. వెంటనే అటువైపు అడుగులేస్తుంటారు. అధిక బరువు సమస్య అనేది ఇప్పుడు సెలబ్రిటీలనే కాదు సామాన్యులను కూడా వేధిస్తూనే ఉంది. అలాంటి వారికోసం అమెరికన్ డ్రగ్ దిగ్గజ కంపెనీ ఎలి లిల్లీ మౌంజారో భారత మార్కెట్‌లోకి ప్రవేశించింది. దీని ధర 5mg మోతాదుకు నెలకు ₹ 17వేల 500గా నిర్ణయించారు. ఇది ప్రారంభం మాత్రమే. అయితే భారత మార్కెట్‌లో ఇప్పటికే ఉన్న బరువు తగ్గించే ఔషధ కంపెన్నీల నుంచి పెద్ద ఎత్తున పోటీ ఎదురుకాబోతుంది. మౌంజారో కన్నా 90-95% తక్కువ ధర గల జనరిక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.