పాపం.. వాటి కోసం.. అర్ధరాత్రి ఆలయానికి అనుకోని అతిథులు..
ఈ మధ్య వన్యప్రాణులు ప్రముఖ ఆలయాలవద్ద హల్‌చల్ చేస్తున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద సంచరిస్తూ భక్తులను పరుగులు పెట్టిస్తున్నాయి. ఒక్కోసారి భక్తులపై దాడులకు పాల్పడుతున్నాయి. అడవుల్లో ఆహారం నీరు దొరక్క, జనావాసాల్లోకి వస్తున్న క్రమంలో రాత్రివేళ ఇళ్లల్లోకి, ఆలయాల్లోకి ప్రవేశిస్తున్నాయి. తాజాగా సత్యసాయి జిల్లాలోని ఓ ఆలయంలో ఎలుగుబంట్లు చొరబడిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
శ్రీ సత్య సాయి జిల్లా రోళ్ళ మండలం జీర్గేపల్లి గ్రామంలోని సారక్క అమ్మవారి ఆలయం ఉంది. రోజూలాగే ఉదయం, సాయంత్రం ఆలయంలో నిత్యకైంకర్యాలు నిర్వహించి పూజారులు తాళం వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో అర్ధరాత్రి ఈ ఆలయంలోకి మూడు ఎలుగుబంట్లు చొరబడ్డాయి. అయితే భక్తులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆహారం కోసం తరచూ రాత్రి సమయాల్లో ఆలయ ప్రాంగణంలో ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయని స్థానికులు తెలిపారు. అవి ఎక్కడ ఇళ్లలోకి చొరబడతాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంట్లను సమీప అటవీ ప్రాంతంలోకి తరలించాలని కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిత్యానంద ఎవరు ?? కైలాస దేశానికి వెళ్లాలంటే ఏం చేయాలి ??
బాత్రూంలో మనిషి జలకాలాట.. ఇంతలో లోపలికి వచ్చిన అనుకోని అతిధి
TOP 9 ET News: దేవరని వెనక్కి నెట్టి.. చరిత్ర సృష్టించిన పెద్ది
Court OTT: OTTలోకి కోర్టు మూవీ.. అఫీషియల్ డేట్ వచ్చేసింది..