Chhaava OTT: గుడ్ న్యూస్ OTTలోకి ‘ఛావా’ డేట్ పిక్స్ ??
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నటించిన ‘ఛావా’ మూవీ ఫిబ్రవరి 14, 2025న థియేటర్లలో విడుదలైంది. మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధిస్తూ ట్రేడ్ నిపుణులను కూడా ఆశ్చర్యపరిచింది. బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన ‘ఛావా’ సినిమా భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది.
అలాంటి ఈ సినిమా థియేటర్లో విడుదలై సుమారు రెండు నెలలు గడుస్తోంది. అయినా ఈ సినిమాకు ప్రజాదరణ తగ్గడం లేదు. మరోవైపు ఈ హిస్టారికల్ మూవీని ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా? అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ ఎదురుచూపులకు తెర పడనుంది. ఛావా మూవీ ఏప్రిల్ పదకొండునే స్ట్రీమింగ్‌కు రానున్నట్టు తెలుస్తోంది. ఛావా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11 నుంచి ఈ బ్లాక్ బస్టర్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. హిందీతో పాటు తెలుగు తదితర దక్షిణాది భాషల్లోనూ ఛావా ఒకేసారి స్ట్రీమింగ్ కు రానుందని తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

