Court OTT: OTTలోకి కోర్టు మూవీ.. అఫీషియల్ డేట్ వచ్చేసింది..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల భారీ విజయాన్ని అందుకున్న చిన్న సినిమా కోర్ట్. మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతోపాటు మంచి వసూళ్లు రాబట్టింది. ఇందులో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా.. హర్ష్ రోహణ్, శ్రీదేవి, శివాజీ కీలకపాత్రలు పోషించారు. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియన్స్ అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఇందులో శివాజీ, ప్రియదర్శి అద్భుతమైన నటన విమర్శకుల ప్రశంసలు లభించాయి. బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అయిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ మూవీ ఓటీటీలో విడుదలవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. కోర్టు మూవీ ఏప్రిల్ 11న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది నెట్ ఫ్లిక్స్ సంస్థ. ఇక హీరో నాని సమర్పించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కోర్ట్ సినిమా థియేటర్లలో తెలుగు భాషలోనే రిలీజ్ కాగా.. ఇప్పుడు ఓటీటీలో మాత్రం ఏకంగా ఐదు భాషలలో అందుబాటులోకి తీసుకురానున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లవ్ స్టోరీ, పోక్సో కేసు చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

